Thursday, March 28, 2024
- Advertisement -

ఉద్యోగులు, నిరుద్యోగులు కేసీఆర్ కు షాకిచ్చారు..

- Advertisement -

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్న కేసీఆర్ ఆశలపై ఉద్యోగులు, నిరుద్యోగులు నీళ్లు చల్లారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించారు.

కేసీఆర్ కుమార్తె కవిత పంతంపట్టి మరీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించాడు. కానీ ఈసారి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టుభద్రుల నియోజకవర్గంలో నిలబడ్డారు. ఎవరైతే ఓడించారో వారినే పట్టభద్రులు, నిరుద్యోగుల అండతో ఓడించాడు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కూడా ఇదే పునరావృతం అయ్యింది.

వరంగల్ ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ కారుకు బ్రేకులు పడ్డాయి.

జనాన్ని మెప్పించిన కేసీఆర్.. పట్టుభద్రులకు ఉద్యోగాలు.. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంలో విఫలమయ్యారు.. అదే ఎన్నికల్లో ప్రస్ఫుటించింది. టీఆర్ఎస్ ను ఓడించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా అందరినీ కలిపేసి కాంగ్రెస్ ను లేకుండా చేద్దామన్న కేసీఆర్ ఆశలు కాంగ్రెస్ తాజా గెలుపుతో ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -