Tuesday, April 16, 2024
- Advertisement -

కారు స్పీడుకు కూట‌మి కుదేలు…ఏపార్టీకీ ఎన్ని సీట్లంటే…?

- Advertisement -

తెలంగాణాలో స్వల్ప సంఘ‌ట‌న‌లు మిన‌హా ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. అభ్య‌ర్తుల‌, పార్టీ భ‌విష్య‌త్ ఈవీఎమ్‌ల‌లో నిక్షిప్త‌మైఉంది. ఈనెల 11న ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి. వివిధ ర‌కాల ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు కూడా టీఆర్ఎస్ పార్టీనే మ‌రో సారి అధికారంలోకి వ‌స్తుంద‌ని స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణలో 66 సీట్లతో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. మహాకూటమి 37 స్థానాలకే పరిమితమవుతుందని అభిప్రాయపడింది. రిప‌బ్లిక్ -జ‌న్‌కీ బాత్ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ 65 స్థానాలు కూట‌మి 38 స్థానాల‌తో స‌రిపెట్టుకోనుంది. భాజాపా7, ఇత‌రులు 12 సీట్లు రానున్నాయి.

‘సీఎన్ఎన్ – న్యూస్ 18’ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నట్టు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం… టీఆర్ఎస్ కు 50-65 స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది. ప్రజాకూటమికి 38-52, బీజేపీకి 4-7, ఇతరులకు 8-14 స్థానాలు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది

సీఎన్ఎన్- న్యూస్ 18’

టీఆర్ఎస్ కు 50-65
ప్రజాకూటమికి 38-52
బీజేపీకి 4-7, ఇతరులకు 8-14 స్థానాలు

తెలంగాణ (119) – టైమ్స్ నౌ

టీఆర్ఎస్ 66
ప్రజాకూటమి 37
బీజేపీ 7
ఇతరులు 9

తెలంగాణ (119) – రిపబ్లిక్ -జన్‌కీబాత్

టీఆర్ఎస్ 50 -65
ప్రజాకూటమి 38- 52
బీజేపీ 4-7
ఇతరులు 10- 12

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -