Friday, March 29, 2024
- Advertisement -

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

- Advertisement -

రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ఫ్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులు, చికిత్స అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది.

ఇందుకోసం తొలుత మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. వీటిలో ఇకపై కరోనా పరీక్షలతోపాటు, కరోనా చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఈ మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్లు, అనుమానితులకు సూచనలు ఇవ్వడం కోసం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన మెడికల్ కాలేజీల్లో మల్లారెడ్డి, మమతా మెడికల్ కాలేజీలు మంత్రులకు చెందినవి కావడం గమనార్హం. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మంత్రి మల్లారెడ్డిది కాగా.. మమతా మెడికల్ కాలేజీ పువ్వాడ అజయ్‌ కుమార్ కుటుంబానికి చెందినది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,745 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 375 మంది మరణించారు.

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎంపీ రఘురామకు ఊహించని షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు..!

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అన్ని ఆసుపత్రిల్లో కరోనా ఉచిత చికిత్స..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -