Friday, March 29, 2024
- Advertisement -

సీనియర్లు కాంగ్రెస్ కు రాంరాంమేనా?

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నావ ఏ దూర తీర చేరబోతోంది. అసలు నాయకులు ఉంటారా.? వీర విధేయులు సైతం పార్టీని వీడుతున్న వేళ పార్టీ గతి ఏం కాను అనే ప్రశ్న ఉదయిస్తోంది. గాంధీల ఫ్యామిలీకి వీరవిధేయుడైన వీ హనుమంతరావు పార్టీని వీడిన వేళ ఇప్పుడు అదే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇందిరగాంధీ హయాం నాటి మనిషి.. రాజీవ్ గాంధీకి అత్యంత దగ్గర. ఇక ఇప్పుడు సోనియా మెచ్చిన నేత వీహెచ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి సోనియా దగ్గరకు సింగిల్ గా ఎప్పుడైనా వెళ్లి మాట్లాడే వీహెచ్ లాంటి వ్యక్తులే ఇప్పుడు కాంగ్రెస్ ను వదిలేస్తుండడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది.

వీహెచ్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ లోని సీనియర్లు కూడా తమను పట్టించుకోవడం లేదని.. పదవులు, సీట్ల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని లోలోపల రగిలిపోతున్నారట.. వీహెచ్ బయటపడ్డాడు కానీ.. మిగతా వారు మాత్రం కాంగ్రెస్ కు దూరంగా స్తబ్దుగా ఉండిపోతున్నారట..

వీహెచ్ ప్రస్తుతం అయితే కమలదళంలోకి వెళ్లాలని యోచిస్తున్నారు. టీఆర్ఎస్ కారెక్కేలా అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారట.. తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ఇలాంటి వృద్ధ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోలేదు. ఇక కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉన్న నేతలను కూడా వీహెచ్ లాగే లాగాలని యోచిస్తున్నారట.. సో ఇదేగనుక జరిగితే కాంగ్రెస్ కు సీనియర్లు రాంరాం చెప్పినట్టేనా అన్న చర్చ సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -