Friday, March 29, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కోరుకుంటున్నారా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజ్ఙతకు, వివేకానికి పరీక్షా సమయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఈ ఒక్క నెల రోజుల ప్రచార మాయ కాదు. మొత్తం ఐదేళ్ళ కాలాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకోండి. 2014 ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చింది ఎవరు? హోదా తీసుకొస్తాం అని చెప్పింది ఎవరు? హోదా వీరుడిగా వెంకయ్యకు వీరతాళ్ళు వేసింది ఎవరు? చంద్రబాబు, మోడీలు మోసం చేస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పినది ఎవరు? ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళపాటు తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత వేగంగా ఎన్ని సినిమాలు చేశాడు? ఆ సినిమాల కోసం కేసీఆర్‌ని ఏ స్థాయిలో పొగిడాడు? ఇప్పుడు అదే కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణా ఉద్యమాన్ని నేను టేకప్ చేసి ఉంటే ఆంధ్రా నాయకులను తన్ని తరిమేస్తాను అని తెలంగాణా గడ్డపై నుంచి ఆంధ్రులను తిట్టిన పవన్‌కి కనీస మనస్సాక్షి ఉందా? నాలుగేళ్ళ పాటు తన సినిమాలు, తన వ్యాపారాలు చూసుకున్న పవన్ ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో జనంలోకి వచ్చాడు. ఇక నాలుగేళ్ళపాటు హోదాతో సహా రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటినీ తాకట్టుపెడుతూ మోడీకి ఊడిగం చేసిన చంద్రబాబు ఎన్నికల ఏడాదిలో మాత్రం ప్రజల సంక్షేమం, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు అంటూ వంగి వంగి దండాలు పెడుతున్నాడు. ఐదేళ్ళ పాటు పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటూ……………పాదయాత్రతో సహా అనుక్షణం ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసం పోరాడిన నాయకుడు జగన్. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ప్రజల మధ్యనే ఉన్నాడు.

ఇప్పుడు ఆలోచించండి. నాలుగేళ్ళపాటు సినిమాలు చేసుకున్న పవన్ కావాలా? నాలుగేళ్ళపాటు మోడీకి ఊడిగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు అన్ని విషయాల్లోనూ అన్యాయం చేస్తూ, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేసీఆర్‌కి సాగిలపడిపోతూ ఉమ్మడి రాజధానిని వదిలేసి బాంచన్ దొర అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల కోసం ఉన్నానంటున్నాడు.

ఈ విషయాలేవీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలియనివ్వకుండా మేనేజ్ చేయడంలో బాబు బ్యాచ్ మీడియా శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే కనీసం మరో 24గంటల పాటు పూర్తిగా మీడియాకు దూరంగా ఉండండి. వాళ్ళందరివీ స్వార్థ ప్రయోజనాలే అన్నది నిజం. అందుకే ఐదేళ్ళుగా మీ కళ్ళ ముందు జరిగిన విషయాలు…………….మీ కళ్ళ ముందు నాయకులు మార్చిన మాటలు……….మీ కళ్ళ ముందే ఐదేళ్ళలో ఎక్కువ సమయం మీ మధ్యనే ఉండి మీ కోసం ఎక్కువ టైం కేటాయించిన నాయకుడు ఎవరో ఆలోచించండి. అబద్ధపు ప్రచారాలతో, ప్యాకేజ్ స్టార్స్‌ని తీసుకొచ్చి చేయించే ప్రచారంతో మమ్మల్ని మోసం చేయలేరు………….మాకు విజ్ఙత, వివేచన ఉన్నాయి……………మా మధ్యనే ఉన్న నాయకుడు ఎవరో………..మా కోసం పార్టీ పెట్టిన నాటి నుంచి కష్టపడిన నాయకుడు ఎవరో మేం డిసైడ్ చేస్తున్నాం అని ఎలుగెత్తి చాటండి. ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కోసం కష్టపడితే ఆ నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అని ఎలుగెత్తి చాటండి. దేశానికే ఆదర్శం కండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -