దేశ త‌ల‌రాత‌ను మార్చేది ఈ న‌లుగురు నేత‌లేనా….?

2018
This Four Play Key Role in Central Politics
This Four Play Key Role in Central Politics

దేశంలోని లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ఆఖరి ఏడో విడత పోలింగ్‌ ఆదివారంతో ముగియ‌నున్నాయి. 23న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ ఫ‌లితాలకోసం దేశ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. దేశ భ‌విష్య‌త్తు ఈవీఎంలో నిక్షిప్త‌మై ఉంది. మ‌రో సారి అధికారంలోకి రావాలి మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్డీఏ కూట‌మి…ఈ సారి భాజాపాకు చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూట‌మి విస్త్రుతంగా ప్ర‌చారం చేశారు. అయితే ఈసారి కేంద్రంలో ఏజాతీయ పార్టీల‌కు పూర్తి మెజారిటీ రాద‌ని…ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటె ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు త‌ప్ప‌ని స‌రి అని స‌ర్వేలు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాయి.

కేంద్రంలో హంగ్ వ‌స్తె యూపీఏ కూట‌మిగాని, ఎన్డీఏ కూట‌మిగాని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటె తెలంగాణా, ఒడిషా, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఏపీ రాష్ట్రాలే కీల‌క పాత్ర పోషిస్తాయి. అందుకే ఇప్పుడు దేశ ప్ర‌జ‌లంద‌రి చూపు ఈనాలుగు రాష్ట్రాల‌వైపే ఉంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, కేరళలో కమ్యూనిస్టులు ప్రాథమిక అంచనాల ప్రకారం మెజారిటీ సీట్లను సాధిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 130, 140 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది.

ఒడిషా, తెలంగాణా, ఆంధ్ర‌, బెంగాల్ రాష్ట్రాల్లో ని ఎంపీ సీట్ల‌లో దాదాపు 105 ఆ ప్రాంతీయ పార్టీల‌కే వ‌స్తాయ‌న‌డంలో సందేహంలేదు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 42 సీట్లకు గాను టీఎమ్‌సీనె మెజారిటీ సీట్లు సాధిస్తుంది. కాంగ్రెస్‌, భాజాపా అక్క‌డ దాదాపు శూన్మ‌మే అని చెప్పాలి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 25 సీట్లుకుగాను వైసీపీ 22 సీట్లు గెలుసుకుంటుంద‌ని స‌ర్వేలు స్పష్టం చేశాయి. తెలంగానా 17 సీట్ల‌కు గాను ఇక్క‌డ టీఆర్ఎస్ దే హ‌వా. ఒడిశాలో 21 సీట్లుకు గాను దాదాపు అన్ని సీట్లు నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ సాధిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నాలుగు రాష్ట్రాల్లో భాజాపాగాని, కాంగ్రెస్ గాని ఎటువంటి ప్ర‌భావం చూప‌వు. మ‌మ‌తా బెన‌ర్జీ భాజాపాకు గాని, కాంగ్రెస్‌కుగాని మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం లేదు. ఫ‌లితాల త‌రువాత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రో వైపు కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ప్రంట్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అది సాధ్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు. ఇక న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. జ‌గ‌న్ కూడా అధికారికంగా ఏపార్టీకి మ‌ద్ద‌తు విష‌యం ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే వారికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ దానికే క‌ట్టుబ‌డి ఉంటార‌న‌డంలో సందేహంలేదు. అందుకే ఇప్పుడు జాతీయ పార్టీలు వీరిని ప్ర‌స‌న్నం చేసుకొనేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశ‌రాజ‌కీయాలు ఈ నాలుగు రాష్ట్రాల చుట్టే తిరుగుతున్నాయ‌న‌డంలో సందేహంలేదు. మ‌ద్ద‌తు ఎవరికి ఇస్తార‌నేది ప‌లితాల త‌రువాత ఏర్ప‌డే రాజ‌కీయ ప‌రిస్థితుల మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

Loading...