Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ నుంచి వైసీపీలోకి ముగ్గురు నేతలు…డేట్ ఫిక్స్

- Advertisement -

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాటి నుంచి అన్ని రకాలుగా గడ్డు పరిస్థితి ఎదురుకుంటుంది అనే చెప్పాలి. ఒక పక్క ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ జగన్ సర్కార్ ముందుకు పోతుంటె…దాన్ని ఎలా నిలువరించాలో తెలియక బాబు తలలు పట్టుకుంటున్నారు.మరో పక్క సొంత పార్టీ నేతలకి అధికార పక్షం చుక్కలు చూపిస్తుండటం కోడెల, యరపతినేని, చింతమనేని లాంటి నాయకుల పై పలు కేసులతో అజ్ణాతంలోకి వెల్లారు.

బాబుపై నమ్మకం లేకపోవడంతో కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోవటం ఆ పార్టీని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది… ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బిజెపి లో చేరటం… ఆ పార్టీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బిజెపి తీర్ధం పుచ్చుకోవటం పార్టీకి నష్టం అనడంలో సందేహంలేదు.

తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమయిన నేత, రామచంద్రాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైకాపా లో చేరటం లాంఛనమే.ఈ నెల 18న త్రిమూర్తులు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. జగన్ సైతం త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రిమూర్తులతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఎన్నికల్లో కాపు నేతలకు ఆర్ధిక సాయం చేయకుండా ఓ సామాజికవర్గానికే సాయం చేశారని తోట ఆరోపణలు చేశారు. తాజాగా అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన…ఆ కార్యక్రమానికి త్రిమూర్తులు రాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందని టీడీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు.

తోటాతో పాటు పార్టీ మారుతున్న ఇద్దరు నాయకులక చేరకకు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.వీరిలో ఒక‌రు జ్యోతుల నెహ్రూ అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ మూడో నేత ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డి కాక‌పోయినా ప్ర‌స్తుతం ముగ్గురు పార్టీ మారుతున్నార‌న్న వార్త బాగా వైర‌ల్ అవుతోంది. ఒకే సారి పార్టీనుంచి మూడు వికెట్లు డౌన్ అవడం బాబుకు కోలుకోలేని దెబ్బే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -