మ‌రో సారి ప్ర‌ధాని మోదీకే జై కొట్టిన ప్ర‌జ‌లు..

267
Times Mega Poll : 83% say Modi to be back as PM in 2019
Times Mega Poll : 83% say Modi to be back as PM in 2019

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేల ఎన్డీఏ ప్ర‌భుత్వానికి బూస్ట్‌లాంటి వార్తే. ప్ర‌ధాని ఎవ‌రు కావాల‌నే దానిపై టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా ఆన్‌లైన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ స‌ర్వేలో భార‌తీయ‌లు మ‌రో సార న‌రేంద్ర మోదీకే జైకొట్టారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటామని 83.89 శాతం ప్రజలు మ‌ద్ద‌తు తెలిపారు.టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా పోల్ లో దాదాపు 2 లక్షల మంది భారతీయులు పాల్గొన్నారు.

మ‌రో వైపు ప్రధానిగా రాహుల్ అభ్యర్థిత్వం పట్ల 8.33 శాతం మంది మాత్రమే ప్ర‌జ‌లు సుముఖంగా ఉన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని కావాలని 1.44 శాతం, మాయావతి పీఎం కావాలని 0.43 శాతం మంది ఆశిస్తుండగా.. ఇతరులు ప్రధాని పీఠంపై కూర్చోవాలని 5.9 శాతం మంది భావిస్తున్నారు.

2014తో పోల్చుకుంటే రాహుల్ ప్రాచుర్యం పెరిగిందా? అని నిర్వహించిన సర్వేలో పెరగలేదని 63.03 శాతం మంది ప్రజలు తెలపగా, పెరిగిందని 31.15 శాతం మంది పెరిగిందని అభిప్రాయపడ్డారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే, యూపీఏ యేతర కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని 3.47 శాతం మాత్రమే అభిప్రాయపడ్డారు.