Thursday, April 25, 2024
- Advertisement -

టీడీపీ పేయిడ్ వర్కర్ల ఆట కట్టించిన పోలీసులు…ముగ్గురు అరెస్ట్

- Advertisement -

వైఎస్ జగన్ సీఎం కావడం టీడీపీ అధినేత జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రభుత్వానికి సమయం కూడా ఇవ్వకుండా జగన్ పై దుష్ప్రచారానికి పూనుకున్నారు. సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు బాబు చేస్తున్న అన్ని ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. పేయిడ్ ఆర్టిస్టులు, వర్కర్లలతో నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా పోలీసులు మరో ముగ్గురి వర్కర్సును అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ భయంకర కుట్ర బట్టబయలైంది.

కొద్దిరోజులుగా తిరమలలో చర్చిల నిర్మాణం జరుగుతోందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఎప్పుడైతే తిరుమలలో చర్చిల నిర్మాణం అనగానే భక్తుల్లో అలజడి మొదలైంది.ప్రతిరోజు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వెళ్ళే వేలాది మంది భక్తులు చర్చి నిర్మాణం ఎక్కడ జరుగుతోందనే విషయంలో ఆరాలు తీస్తున్నారు. కాని ఎక్కడా కూడా చర్చిలాంటి ఆనవాల్లు లేవు.

ఈ ఫోటోలు మరింత వైరల్ కావడంతో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రచారం జరుగుతున్న సోషల్ మీడియాపై కన్నేసిన పోలీసులు ప్రచారానికి కారణమైన ముగ్గురుని గుర్తించారు..వారి అడ్రసులను సంపాదించిన పోలీసులు మొత్తానికి వాళ్ళు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచిరించినపుడు తాము టిడిపి చెప్పినట్లే చేస్తున్నామని అంగీకరించినట్లు సమాచారం.

గతంలో వరదలు వచ్చినపుడు రైతుల వేషంలో పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి ప్రభుత్వాన్ని టిడిపి అమ్మనాబూతులు తిట్టించిన విషయం తెలిసిందే. ఆ విషయం బయటపడేటప్పటికి పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం విషయంలో చంద్రబాబు, చినబాబుతో సహా ఎవరూ నోరిప్పలేదు.తాము జగన్ పై చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు జనాల నుండి పెద్దగా స్పందన రాకపోవటంతో ఏదో ఓ విధంగా బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉంది. సరే ఏ రకంగా ప్రయత్నించినా అదంతా టిడిపికే రివర్సు అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -