Friday, April 26, 2024
- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వానికి ట్రైబ్యున్‌ల్ షాక్‌.. గోరంట్ల మాధ‌వ్‌కు లైన్ క్లియ‌ర్‌

- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వానికి ట్రైబ్యున‌ల్ షాక్ ఇచ్చింది. హిందూపురంనుంచి వైసీపీ త‌రుపున ఎంపీగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధ‌వ్ నామినేష‌న్ వేస్తారావేయ‌రా అన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఆయ‌న నామినేష‌న్‌ను స్వీక‌రించాల‌ని ఎన్నికల సంఘాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది.వీఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కొద్ద‌రోజుల‌క్రితం ప్ర‌భోధానంద ఆశ్ర‌మానికి సంబంధంచిన విష‌యంలో మాధ‌వ్ పేరు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. క‌దిరి సీఐగా ప‌నిచేస్తున్న మాధ‌వ్‌కు టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌ధ్య భోధానంద ఆశ్ర‌మ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం చ‌ల‌రేగిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ నుంచి రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీఆర్ఎస్‌కు అప్లై చేసిన అనంత‌రం మాధ‌వ్ వైసీపీలో చేరారు. వైసీపీ త‌రుపున హిందూపురం ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న వీఆర్ఎస్‌ను ప్ర‌భుత్వం ఆమోదించ‌క‌పోవ‌డంతో నామినేష‌న్ ను తిర‌స్క‌ర‌ణ‌కు గురి అవుతంద‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌త్యామ్నాయంగా వేరే పేరును కూడా ప‌రిశీలించింది వైసీపీ అధిష్టానం.

డిసెంబర్ 30వ తేదీన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. దీంతో మాధ‌వ్ ట్రైబ్యునల్‌ను
ఆశ్రయించారు . 90 రోజులకు ముందుగా వీఆర్ఎస్‌‌కు దరఖాస్తు చేసుకోవాలని పోలీసుశాఖ వాదించింది. ఇద్దరి వాదనలను విన్న తర్వాత మాధవ్ పోటీ చేసేందుకు వీలుగా విధుల నుండి తప్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అత‌ని వీఆర్ఎస్‌ను వెంట‌నే ఆమోదించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో వైసీపీశ్రేణుల్లోఆనందం మొద‌ల‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -