Friday, April 19, 2024
- Advertisement -

హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట…అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ‌

- Advertisement -

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెరాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో అధికార‌పార్టీ టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ‌త‌గిలింది.

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కోమటిరెడ్డి గవర్నర్‌పైకి హెడ్‌ఫోన్ విసరడంతో అది మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తాకింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన స్పీకర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేశారు.

దాంతో హైకోర్టును ఆశ్ర‌యించారు కోమ‌టిరెడ్డి, సంప‌త్‌రెడ్డిలు . విచారించిన హైకోర్టు వారిద్ద‌రి స‌భ్యుత్వాల‌పై విధించిన నిషేధం చెల్లదని.. వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేటుకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి సభ్యత్వాన్ని రద్దు చేయొద్దని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటీషన్ వేయగా.. దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -