Saturday, April 20, 2024
- Advertisement -

ఫిరాయింపు నేత‌ల‌పై వేటుకు సిద్ద‌మ‌యిన కేసీఆర్‌..

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఫిరాయించిన వారిపై వేటు వేసేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఎన్నిక‌ల ముందు టికెట్ రాని వారంతా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొండా మురళి, భూపతి రెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో పార్టీ పరంగా వీరిపై వేటు వేసిన టీఆర్ఎస్… ఇక వీరిపై వేటు వేయాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేయనుంది. మరికాసేపట్లో టీఆర్ఎస్ నేతలు శాసనమండలి చైర్మన్ ను కలిసి ముగ్గురిపై ఫిర్యాదు చెయ్యనున్నారు.

వీరిలో కొండా మురళి, భూపతిరెడ్డి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. యాదవరెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవగా, రాములునాయక్‌ను గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. తన భార్య కొండా సురేఖకు టికెట్ నిరాకరించడంతో కొండా మురళి కూడా ఆమెతో పాటు పార్టీ మారారు. ఇక కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ అనుచరుడు భూపతిరెడ్డి… కాంగ్రెస్ తరపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక నారాయణఖేడ్ టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రాములునాయక్… ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చి ఉంటే వీరి ఎమ్మెల్సీ పదవులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ టీఆర్ఎస్ రావ‌డంతో వారు ప‌ద‌వుల‌ను వదులుకోవాల్సిన ప‌రిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -