Friday, April 19, 2024
- Advertisement -

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

- Advertisement -

దుబ్బాక లో ఎన్నికలకు అంతా సిద్ధమయ్యింది.. అన్ని పార్టీ ల అభ్యర్థులు ఖరారు కాగా ఇక్కడ టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు చెప్తున్నారు.. అక్కడి అభ్యర్థులు కూడా ప్రచార పర్వంలో ఒకరి పై ఒకరు విమర్శించుకుంటూ ప్రజల్లో కి దూసుకుపోతున్నారు.. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ఇవ్వగా, బీజేపీ పార్టీ రఘునందన్ రావు సీటు ను కేటాయించింది.. అధికార పార్టీ సోలిపేట సుజాత‌కు సీటు ఇవ్వగా గెలుపుపై ధీమాగా ఉంది..

ఈ త్రిముఖ పోరులో గెలుపుకోసం అందరు అభ్యర్థులు స్థానికంగా బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం అధికార పార్టీ ఇక్కడ గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.. తొందర్లోనే నామినేష‌న్ల ప‌ర్వం కూడా మొద‌లు కానుంది. నామినేష‌న్ల‌కు ముందే వ‌ల‌స‌ల‌ను ఆయా పార్టీలు ప్రోత్స‌హిస్తున్నాయి. పార్టీలో చేరేందుకు ఆస‌క్తి ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాయి. కొంత మందిని టార్గెట్ చేసి మ‌రీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అధికార‌పార్టీ కావ‌డంతో టీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తు‌న వ‌ల‌స‌లు వ‌స్తున్నారు. దీనికి తోడు అక్క‌డ మంత్రి హ‌రీశ్ ద‌గ్గ‌రుండి చ‌క్రం తిప్పుతున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతేకాదు అదే స్థాయిలో గులాబీ పార్టీ నుంచి కూడా వలసలు పెరుగుతున్నాయి.. అయితే ద్వితీయ శ్రేణి నాయకులూ తెరాస ని వీడుతుంటే పెద్ద పెద్ద లీడర్లు తెరాస కి రావడం ఆ నేతలకు కొంత ఉత్సాహాన్నిస్తుంది.. ఇప్పటికే టీఆర్ఎస్‌లో నరసింహారెడ్డి, మనోహర్ రావు, బంగారయ్య లాంటి సీనియర్ నాయకులు చేరారు.. వారు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వారికి పార్టీ మీద ఉన్న నమ్మకమే అంటున్నారు.. అయితే ఈ చేరికలు అధికార పార్టీ కి మంచి బలం చేకూరుతుండగా టీ ఆర్ ఎస్ పార్టీ తొందరలోనే . దుబ్బాకలో  భారీ మెజార్టీతో గెలిచి చరిత్రలో నిలిచి పోతుందన్నారు. 

దుబ్బాక లో బీజేపీ గెలవడం కష్టమేనా..?

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతం వర్క్ అవుట్ అయ్యేలా ఉందే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -