Friday, March 29, 2024
- Advertisement -

కేటీఆర్ ప్ర‌శ్న‌ల‌కు బాబు వ‌ద్ద స‌మాధానం ఉందా?

- Advertisement -

డేటా థెప్టింగ్‌పై కేటీఆర్ స్పందించారు. మాముల‌గా కాదు.. చాలా హైప‌ర్‌గా స్పందించారు. తెలంగాణలో రిజిస్టర్ అయ్యి, హైదరాబాద్‌లో మకాంపెట్టిన ఐటీ గ్రిడ్‌ సంస్థ ఏపీకి సంబంధించిన డేటాను తస్కరించిందని, దాన్ని తప్పుడు పనులకు ఉపయోగిస్తూ ఉంద‌నేది ఆరోప‌ణ‌.

ఈ డేటా వివాదంపై కేటీఆర్ ఏం అన్నారు.. ఏమ‌ని ప్ర‌శ్నించారు ..

ఐటీ గ్రిడ్స్ ఆనే ఆ సంస్థ ఎలాంటి తప్పుడు పనికీ పాల్పడకపోతే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీమంత్రి నారాలోకేష్ లు అంతగా ఉలికిపాటుకు ఎందుకు గురి అవుతున్నారు?

ఇది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాదు అని.. హైదరాబాద్ లో దొంగతనం జరిగింది కాబట్టి.. హైదరాబాద్ లోనే ఫిర్యాదు అందిందని, విచారణ జ‌రుగుతుంద‌న్నారు.

ఏపీ ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీనే అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అలా డాటా తీసుకుని.. దాన్ని వక్రమార్గాల కోసం వాడుకొంటున్నట్టుగా ఉంది.

ఎన్నికల్లో నెగ్గలేమనే విషయం చంద్రబాబుకు అర్థం అయ్యిందని.. అందుకే ఇప్పడు ఏపీ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు.

అడ్డంగా దొరికారు కాబ‌ట్టే చంద్రబాబు – లోకేష్ లు మిద్దె నెక్కి అరుస్తున్నారు. ఏపీ పోలీసు లకు తెలంగాణ లో ఏం పని? ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడాలి.

చంద్రబాబు 18 కేసుల్లో స్టే లు తెచ్చు కున్నారు .ఈ కేసు లోనూ స్టే తెచుకోమనండి. ఎందుకు భయం ? నకిలీ పేస్ బుక్ ఐడి లు సృష్టించి టీఆర్ ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ..ఈ డ్రామాలను ప్రజలు నమ్మరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -