Saturday, April 20, 2024
- Advertisement -

త్వ‌ర‌లో ఏపీకీ వెల్లి జ‌గ‌న్‌ను కేసీఆర్ క‌లుస్తారు…కేటీఆర్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌తో తెలంగాణా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ భేటీ ముగిసింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే..ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా కేటీఆర్‌, జ‌గ‌న్ భేటీ అయ్యారు. ప్ర‌ధానంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌, రాష్ట్రాల‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాలు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై గంట‌న్న‌ర్ర పాటు చ‌ర్చించారు.

భేటీ అనంత‌రం ఇద్ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనతో ఫోన్ లో మాట్లాడారని… ఈరోజు తారక్ (కేటీఆర్) వచ్చి కలిశారని, అన్ని విషయాలను చెప్పారని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం, దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు కలవాల్సిన పరిస్థితి తదితర అంశాలను వివరించారని చెప్పారు.

ప్ర‌త్యేక‌హాదా విష‌యంలో పార్ల‌మెంట్‌లో ఇచ్చిన హీమీకే దిక్కులేద‌ని….హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరఫున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో విస్త్రుతంగా చర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడచిన కొన్నేళ్లుగా దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన వద్ద ఉంచుకుని రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేస్తోందని చెప్పారు. ఏపీకీ ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

దేశంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం కొన్ని నెల‌లుగా కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అందులో భాగంగానే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదతర నేతలను కలిశారని చెప్పారు. జగన్ తో జరిగిన భేటీలో అన్ని విషయాలను పంచుకున్నామని కేటీఆర్ అన్నారు. అందరు నేతలను కలిసినట్టే… ఏపీకి వెళ్లి జగన్ ను కేసీఆర్ కలుస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -