Friday, March 29, 2024
- Advertisement -

తొడగొట్టిన కేటీఆర్.. దమ్ముంటే కాచుకోండి

- Advertisement -

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కేటీఆర్ దూకుడు పెంచారు. హైదరాబాద్ వైరల్ జ్వరాలపై యుద్ధం ప్రకటించి అక్కడ పరిస్థితిని మామూలు స్థితికి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఊరికే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీకి బస్తీమే సవాల్ అంటూ కేటీఆర్ తొడగొట్టేశారు.

బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచి లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలిచింది. కేటీఆర్ సారథ్యంలో జరిగిన ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం టీఆర్ఎస్ ను వెంటాడాయి. దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని కేటీఆర్ తాజాగా పార్టీ కార్యకర్తలు, నేతలతో తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారట..

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించి టీఆర్ఎస్ పవర్ చూపించాలని.. ఎక్కడా ఆ పార్టీకి నూకలు లేకుండా చేసి విర్రవీగే నేతలకు చెక్ చెప్పాలని కేటీఆర్ దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.

ఇప్పటికే కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రామ, మండల స్థాయి టీఆర్ఎస్ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులు నియమించేశారు. పట్టణాల్లో వార్డుల అధ్యక్షులను కూడా బాగా పనిచేసేవారికే కట్టబెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కేంద్రంగా కేటీఆర్ కదనోత్సాహం పార్టీలో జోష్ నింపుతోంది. ఇదే ఊపుతో బీజేపీని కొట్టేయాలని కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -