శ‌వాల‌మీద పేలాలు ఏరుకొనె ర‌కం చంద్ర‌బాబు… కేసీఆర్ ఫైర్‌

444
TS CM KCR Serious Comments on AP CM Chandrababu
TS CM KCR Serious Comments on AP CM Chandrababu

ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్ర‌బాబుపై ఘోర మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో బాబు అంత స్వార్థ‌ప‌రుడు ఇంకొక‌రు ఉండ‌న్నారు. త‌న స్వార్థ రాజ‌కీయాల‌కోసం సొంత మ‌నుషుల‌ను వాడుకోని వ‌దిలేయ‌డంలో బాబు సిద్ద‌హ‌స్తుడ‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

చివరకు హరికృష్ణ చావును కూడా చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకోవాల‌ని చూశార‌న్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా దారుణంగా రాజకీయాలకు ఉపయోగించుకున్నారని…ఇప్పుడేం ఏ న్యాయం చేస్తారని కేసీఆర్‌ ప్రశ్నించారు. శ‌వాల‌పై పేలాలు ఏరుకొనె నైజం బాబుద‌న్నారు. గతంలో హరికృష్ణను కానీ హరికృష్ణ కుటుంబాన్ని కానీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత ఎన్నిక‌ల కోసం గుర్తు కొచ్చారాని ప్ర‌శ్నించారుజ‌ ఇలాంటి వ్యక్తిని ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారంటూ ప్రశ్నించారు.

హ‌రికృష్ణ చావుని కూడా బాబు సొమ్ముచేసుకోవాల‌ని చూశార‌న్నార‌ని మండిప‌డ్డారు. ఆయన చావు సింపతీని సొమ్ము చేసుకోవడానికి నీచ రాజీయాల‌కు తెర లేపార‌న్నారు. ఇంతకన్నా నీచత్వం ఉంటుందాని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు స్వ‌యం ప్ర‌కాశం ఉన్న నేత కాద‌ని ఎద్దేవ చేశారు.

Loading...