Saturday, April 20, 2024
- Advertisement -

సిరిసిల్లలో కేటీఆర్ కు ఎదురీత తప్పలేదు

- Advertisement -

సిరిసిల్ల మున్సిపాలిటీ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కేంద్రం. అలాంటి చోట అంతా క్లీన్ స్వీప్ అనుకున్నారంతా.. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల వారు గులాబీ పార్టీలో చేరడంతో ఇక కేటీఆర్ ఇలాకాలో క్లీన్ స్వీప్ ఖాయమని భ్రమపడ్డారు. అయితే తాజా ఫలితాలు కేటీఆర్ కు ఊహించని షాక్ ను ఇస్తున్నాయి.

సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా ఇప్పటివరకూ 10 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ ఇందులో 4 స్థానాలు మాత్రమే గెలుచుకోగా.. ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. కాంగ్రెస్ 2, బీజేపీ 2 సీట్లు గెలుచుకొని టీఆర్ఎస్ కు షాకిచ్చాయి.

అస్సలు ఉనికిలోనే కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ రెండు చొప్పున సీట్లు సాధించడం.. ఇండిపెండెంట్లు గెలవడంతో మున్సిపాలిటీపై ఎవరి జెండా ఎగురుతుందనే టెన్షన్ టీఆర్ఎస్ ను వెంటాడుతోంది.

సొంత ఇలాకా లో కేటీఆర్ ఓడిపోతే మాత్రం గులాబీ పార్టీకి అంతకంటే పెద్ద డ్యామేజ్ ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -