Friday, March 29, 2024
- Advertisement -

హుజూర్ నగర్ ఎన్నికలు ఉత్తమ్ కు అనుకోని షాక్

- Advertisement -

తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్. దీన్ని దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. హుజూర్ నగర్ ఎన్నిక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ గెలుపు తోనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని అంటున్నారు. గెలిస్తేనే రాజకీయంగా మనుగడ సాధ్యమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ఉత్తమ్ స్టామినాకు పరీక్షగా హుజూర్ నగర్ ను పెట్టిన అధిష్టానం అల్టిమేటం కూడా జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

హుజూర్ నగర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. 2009 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈ దఫా ఆయన ఎంపీగా గెలవడం తో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఉప ఎన్నిక వచ్చిన హుజూర్ నగర్ కు కొత్త అభ్యర్థిని నిలుపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించింది. అయితే తన సిట్టింగ్ స్థానంలో తన భార్య నే అభ్యర్థిగా ఎంపిక చేశాడు ఉత్తంకుమార్ రెడ్డి. ఇప్పుడామె గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు.

ఒకవేళ పద్మావతి గెలువకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన పీసీసీ పదవి ఈ గెలుపు పైన ఆధారపడి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో కొత్త అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నించగా ఉత్తంకుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. తన భార్య నే అభ్యర్థిగా సోనియా గాంధీ ని ఒప్పించాడు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్ లో గెలుపు ఉత్తమ్ స్టామినాకు, ఆయన పీసీసీ పదవికి లంకె గా మారింది. భార్యని గెలిపిస్తేనే ఉత్తం పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం ఉంది. లేదంటే పీసీసీ పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.

అందుకే ఉత్తమ్ తన భార్య ని గెలిపించేందుకు పీసీసీ లోని సీనియర్ నేతలు అయిన పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్.. చివరకు రేవంత్ రెడ్డిని కూడా ఉత్తమ రంగంలోకి దింపుతున్నారు. వీరందరి ప్రచారంతో గెలిపించి తన పిసిసి పదవిని కూడా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఉత్తమ్ పీసీసీ పదవి కేంద్రంగా జరుగుతున్న హుజూర్ నగర్ ఎన్నికలో పద్మావతి గెలుస్తుందా? టిఆర్ఎస్ గెలుస్తుందా పీసీసీ పదవి ఉత్తమ కు కొనసాగుతుందా అనేది తెలియాలంటే ఈనెల 21న జరిగే ఉప ఎన్నిక వరకూ ఆగాల్సిందేనన్న చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -