Thursday, April 25, 2024
- Advertisement -

రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. జగన్ కు గుడ్ న్యూస్..!

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని, మూడు రాజధానుల అంశం చర్చనీయం అయిన విషయం తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు మరో మలుపుకు తిరిగింది. ఏపీ హైకోర్టులో రాజధాని అంశంపై కేంద్రం అఫిడవింట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం అనేది కేంద్ర పరిధిలో ఉంటుందా.. లేక రాష్ట్ర పరిధిలోనిదా అనే విషయంపై కేంద్రం హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల నిర్ణయం అనేది ఆయా గౌవర్నమెంట్ ల పరిధిలోని అంశమని.. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కౌంటర్ ఇచ్చింది. చట్ట సభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తెలిపింది. రాజధాని ఏర్పాటు అనేది కేంద్రం పరిధిలోని అంశమని పి.వి.కృష్ణయ్య ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణయ్య పిటిషన్‌పై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్ దాఖలు కావడంతో జగన్ ప్రభుత్వానికి మూడు రాజధానుల విషయంలో ఓ విధంగా ఊరట లభించిందని చెపవచ్చు. గత వారం ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపి.. గెజిట్ విడుదల చేశారు. ఈ విషయంపై సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హై కోర్టు విచారణ జరిపి.. స్టేటస్ కో విధించింది తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

ఏపీ సర్కార్ ను రిప్లై ఇవ్వమని అడిగింది. ఇప్పుడు రాజధాని అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే గతంలో రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత మహిళలు సచివాలయం ముట్టడికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అమరావతి మహిళలు హైకోర్టును ఆశ్రించిన లాభం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బాలయ్య, పవన్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా ? : ఎమ్మెల్యే…

చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

వైసీపీలోకి గంటా.. డేట్ కూడా ఫిక్స్.. క్లారిటీ వచ్చేసింది..!

చంద్రబాబుకు షాక్ : టీడీపీ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -