అత్యాధునిక సదుపాయలు ఉన్నటువంటి 108, 104 అంబులెన్స్ లను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసు పాలుపంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ప్రాజెక్టుల్లో టెక్నికల్, లీడ్ పార్టనర్లుగా ఉన్న అరబిందో ఫార్మా, యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసులకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. “సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే ఆయనతో భేటీ అయ్యాను.
విద్య, వైద్యం తన తొలి ప్రాధాన్యతలని ఆరోజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యుత్తమ అంబులెన్స్ సర్వీసులు అందడంలో యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసెస్ భాగస్వామ్యం కావడం చూసి ఆశ్చర్యపోయాను’’ అని ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.
పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్
మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన సహ ఉద్యోగి..!