బండ్లు ఓడ‌లు…. ఓడ‌లు బండ్లు అవుతాయంటే ఇదేనేమో…!

12991
UPA Chairperson Sonia Gandhi Special Invitation to YSRCP, TRS and TDP
UPA Chairperson Sonia Gandhi Special Invitation to YSRCP, TRS and TDP

వ‌సుదేవుడు అంత‌టి వాడె గాడిద కాళ్లు ప‌ట్టుకున్నార‌న్న సామెత ఇప్పుడు కాంగ్రెస్ కు అచ్చు గుద్దిన‌ట్ల స‌రిపోతుంది. యూపీఏ హ‌యాంలో అన్ని తానై న‌డిపిన దేశంలో శ‌క్తివంత‌మైన నాయ‌కురాలిగా…. యూపీఏను అన్నీ తానై న‌డిపించిన సోనియా చివ‌ర‌కు జ‌గ‌న్ కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వైఎస్ మ‌ర‌ణానంత‌రం కాంగ్రెస్‌, టీడీపీలు క‌ల‌సి త‌మ స్వార్థ‌రాజ‌కీయాల‌కోసం జ‌గ‌న్‌ను అక్ర‌మ‌కేసుల్లో ఇరికించి పైశాచికానందం పొందారు. త‌మ మాట‌కు ఎద‌రు చెప్పార‌న్న కార‌ణంగా కాంగ్రెస్ అధిష్టానం జ‌గ‌న్‌ను ఒంట‌రి వాడిని చేసి అవ‌మాన క‌రంగా బ‌య‌ట‌కు పంపించారు. కాని జ‌గ‌న్ మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కునిలా చివ‌ర‌కు అదే అధిష్టానాన్ని త‌న కాల్ల‌ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకున్నారు. శ‌క్తివంత‌మైన రాజ‌కీయ నాయ‌కురాలు అని చెప్పుకొనే సోనియాగాంధీ చివ‌ర‌కు జ‌గ‌న్ సాయం కోసం ఆయ‌న ఇంటి ముందు ప‌డిగాపులు కాస్తున్నారు.

ఈ సారి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేంద్రంలో ఏపార్టికి పూర్తి మెజారిటీ రాద‌ని హంగ్ వ‌స్తుంద‌నె సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఫ‌లితాలు రాక‌ముందె ప్రాంతీయ పార్టీల‌ను ప్ర‌స‌న్నం చేసుకొనేందుకు నానా పాట్లు ప‌డుతోంది. దీనిలో భాగంగా ఫ‌లితాల అనంత‌రం బీజేపీయోతర పక్షాలతో సమావేశం కావాలని స్వ‌యంగా సోనియాగాంధీ లేఖ‌లు రాసిన‌ట్లు స‌మాచారం. దానిలో భాగంగానె వైసీపీకి సోనియా లేఖ రాసింది.

ఒక ప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని చిన్న చూపు చూడ‌టంతో పాటు ద్వేశించిన సోనియా గాంధీ చివ‌ర‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తుకోసం పాకులాడుతున్నారు. అయితే సోనియా గాంధీ లేఖ‌ను జ‌గ‌న్ లైట్‌గా తీసుకున్న‌ట్లు పార్టీలో వినిపిస్తోంది. సోనియా నిర్వహించే సమావేశానికి ఆయన హాజరవుతారా? అంటే.. ఆ సమస్యే లేదు అని అంటున్నాయి వైఎస్సార్సీపీ వర్గాలు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌యేజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. సోనియా గాంధీ పిల‌వ‌గానె పరిగెత్తుకుంటూ వెళ్లేందుకు వైఎస్ జగన్ ఏమీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు లాంటి వ్యక్తి కాదనే విషయాన్ని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తుంచుకోవాలని పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

Loading...