Thursday, April 25, 2024
- Advertisement -

దమ్మున్న పీసీసీ కొత్త నేత ఎవరు?

- Advertisement -

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ను ముందుండి నడిపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహాకూటమి కట్టి టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టులతో కలిసి అధికార టీఆర్ఎస్ ను ఓడించడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. టీడీపీ మీడియా అండదండలతో ఒకానొక సమయంలో గెలుపు పక్కా అని ధీమా కూడా వచ్చేసింది. కానీ ప్రజలు మాత్రం గులాబీ పార్టీనే ఆదరించారు..

ఇక పీసీసీ చీఫ్ గా ఐదేళ్లు ఉన్న ఉత్తమ్ సారథ్యం విఫలం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చి ఢిల్లీకి సాగనంపింది. ఇప్పుడు ఆయన ఎంపీగా వెళ్లడంతో పీసీసీ చీఫ్ గా కొత్త నేతను వెతుక్కునే సమయం వచ్చింది.

అయితే ఎంపీ ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటిన ఉత్తమ్, పరిషత్ ఎన్నికల్లో 32 జిల్లాల్లో ఘోర ఓటమితో ఇక తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే రాజీనామా దిశగా అడుగులు వేసినట్టు సమాచారం. టీపీసీసీ చీఫ్ గా తప్పుకుంటానని పార్టీ అధిష్టానాన్ని కోరగా.. నెల రోజులపాటు కొనసాగాలని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం సూచించిదట..

ఈ నెలరోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే సత్తాగల నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం శూలశోధన చేయనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా రేసులో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి లాంటి నేత తనకే కావాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి 5 ఏళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ వచ్చే ఐదేళ్లకు అయినా అధికారంలోకి రావాలంటే దమ్మున్న నేత పీసీసీ పగ్గాలు చేపట్టాల్సిందే.. మరి ఆ నేత ఎవరనేది త్వరలోనే తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -