Wednesday, April 24, 2024
- Advertisement -

టీఆర్ఎస్ ను డిఫెన్స్ లో నెట్టే ఉత్తమ్ వ్యూహం ఇదే

- Advertisement -

హుజూర్ నగర్.. చూడడానికి సూర్యపేట జిల్లాలోనే ఉన్నా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు. ఇక్కడ ఆంధ్రావారి ప్రాబల్యం ఎక్కువ. అందుకే గులాబీ బాస్ ఎంత ప్రయత్నించినా ఇక్కడ గెలవలేకపోయారు. ఇక బలమైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉండడం కూడా టీఆర్ఎస్ శరాఘాతంగా మారింది. అయితే ఈసారి ఉత్తమ్ లేడు. ఆయన భార్య బరిలోకి దిగింది. ఇదే అదునుగా హుజూర్ నగర్ ను కైవసం చేసుకోవడానికి కేసీఆర్ స్కెచ్ గీసినట్టు సమాచారం.

అయితే వ్యూహాత్మకంగానే తన భార్యను బరిలోకి దించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ తాజాగా టీఆర్ఎస్ పై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తాజాగా ఉత్తమ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి నిలుస్తున్న సైదిరెడ్డి స్థానికతపై చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

టీఆర్ఎస్ ఆంధ్రావ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఉత్తమ్ అన్న మాట ఓటర్లు స్థానికులపై తీవ్ర ప్రభావం చూపుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

అయితే టీఆర్ఎస్ దీనిపై కౌంటర్ ఇస్తోంది. సైదిరెడ్డిది సూర్యపేట జిల్లా గుండ్లపల్లి గ్రామం అని.. కృష్నా నది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని చెబుతోంది.స సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి సర్పంచ్ గా చేశాడని.. ఈయన బంధువులు గెలిచారని చెబుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డియే నాన్ లోకల్ అంటూ వాదిస్తోంది.

మొత్తం స్థానికేతర వివాదంతో హుజూర్ నగర్ లో లబ్ధి పొందాలనే ఉత్తమ్ ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -