టీడీపీలో చీలక.. బాబుకు షాకిచ్చిన టీడీపీ నేతలు

3691
Uttarandhra TDP Leaders Shock to Chandrababu
Uttarandhra TDP Leaders Shock to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు తాము బలి కాకూడదని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారా? అందుకే టీడీపీని చీల్చారా? టీడీపీ అధినేత విశాఖ పర్యటనకు వచ్చినా దూరంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది.

తాజాగా ప్రజా చైతన్యయాత్ర పేరిట విశాఖలో పర్యటించిన చంద్రబాబు హంగామా తర్వాత ఒకటే స్పష్టమైంది. టీడీపీ నిట్టనిలువునా చీలినట్టు అర్థమైంది. చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర టీడీపీ కేడర్ దూరమైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కొందరు నేతలు బహిరంగంగా బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఏకంగా చంద్రబాబు దరిదాపుల్లోకి రాలేదు. ఈయనే కాదు.. టీడీపీ నేతలు ఎవరూ కూడా బాబును కలవలేదు.

చంద్రబాబు పర్యటన అంటే గంటా సహా ఉత్తరాంధ్ర నేతలంతా ఆయనకు స్వాగతం పలికి నెత్తిన పెట్టుకునే పరిస్థితి. కానీ ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం విశాఖలో కనిపించింది.

విశాఖ రాజధానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న చంద్రబాబుకు విశాఖలో ఎదురైన ఈ అనుభవం ఆయనకు వ్యక్తిగతంగానే కాదు.. పార్టీ పరంగా కూడా పెద్ద దెబ్బగా పరిగణిస్తోంది. వీరంతా టీడీపీకి దూరమైనట్టేనన్న వాదన వినిపిస్తోంది. చూడాలి మరీ టీడీపీ ఉత్తరాంధ్ర అడ్రస్ గల్లంతువుతుందా కాదా అన్నది..

Loading...