Thursday, April 25, 2024
- Advertisement -

వీరావేశంగా ముద్రపడిపోతున్న బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు..!!

- Advertisement -

బీజేపీ అధ్యక్ష పదవి కి సోము వీర్రాజు ను నియమించడమేమో కానీ సొంత పార్టీ నేతలు కూడా అయన ను నమ్మే పరిస్థితి లేదు.. ఇక ఇతర పార్టీ నాయకులైతే సోము వీర్రాజు ను తమ ప్రత్యర్థి అన్న మాట అటుంచితే కనీసం కార్యకర్త గా గుర్తించడం లేదని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు సోము ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ కోసం కష్టపడే వారిని సస్పెండ్ చేయడాలు వంటి కార్యకలాపాలతో అయన చెడ్డ పేరు నే మూటగట్టుకుంటున్నారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించని నేతని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించటం రాష్ట్ర బిజెపి నేతలనే ఆశ్చర్యపరిచింది అని చెప్పుకోవచ్చు. దీనిపై సొంత పార్టీ నేతలే కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి సోము వీర్రాజు పై చాలా ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి.. విడదీసే రాజకీయాలు ఆయన చేస్తుంటారని, ఎవరితోనో ఎక్కువగా కలవడు, అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న మనిషి కాదు అని ఆయన్ని సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తారు. ఏది మాట్లాడితే ఏది తంటా వస్తుందో అనే ఆందోళన వారిలో ఉందట. ఇటీవల ఒక నేతను ఆయన సస్పెండ్ చేశారు. అతను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు కానీ, సస్పెన్షన్ వేటు మాత్రం పడింది. అమరావతికి మద్దతుగా మాట్లాడటమే ఆయన చేసిన నేరం అని బిజెపి నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సోము వీర్రాజు ఎక్కడ చర్యలు తీసుకుంటారో అనే భయం వారిలో ఉందట.

నిజానికి ఇటీవల ఒకరు ఇద్దరు నేతలు అయితే ఒక బిజెపి ఎంపీ గారికి ఈ పరిస్థితి మొత్తం వివరించారట. అంతే కాదు ప్రజల్లోకి వెళ్తే కూడా ఈ అనుమతి కావాలేమో అనే భయం వారిలో ఉంది. మీడియా ప్రతినిధులు ఎవరు అయినా పలకరించినా సరే జాగ్రత్తగా రెండు మూడు మాటలతో కట్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అధికార పార్టీని వెనకేసుకొస్తూ, ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ప్రజా సమస్యల పైన ఆయన చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -