23 త‌రువాత చంద్ర‌బాబు నిరుద్యోగి…..

189
Vijaya Sai Reddy Satirical setairs on chandra babu in twitter
Vijaya Sai Reddy Satirical setairs on chandra babu in twitter

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా విరుచుకు ప‌డ్డారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. చంద్రబాబును టార్గెట్ చేస్తూ రోజూ ట్వీట్లు చేసే సాయిరెడ్డి… ఇవాళ ఇలా స్పందించారు. యూపీఏ మిత్ర‌ప‌క్షాల‌ను ఏకం చేసేందుకు ఢిల్లీలో బిజీగా ప‌డుపుతున్న బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేద‌న్నా. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసిన బాబుకు కోర్టు మొట్టికాయ‌లు వేసినా మార్పురాలేద‌న్నారు. 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.” అంటూ మరో హాట్ ట్వీట్ వేశారు.

ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయ‌న్నారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.

Loading...