నాగబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన విజయశాంతి..!

644
vijayashanti strong reply on nagababu tweet
vijayashanti strong reply on nagababu tweet

వివాదాల్లోకి కొందరు తెలిసి వెళ్తారు. కొందరు తెలియకుండానే వెళ్తారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం వివాదాల్లోకి కావాలనే వెళ్తారు అన్నటు అనిపిస్తుంది. కొన్ని విషయాలు చర్చ కన్నా కూడా అప్పటికే తమకున్న అభిప్రాయం నుంచి బయటకు రాకుండా మాట్లాడేసే ధోరణి కనిపిస్తుంటుంది. అలాంటి వాటితో జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే ‘నిజమైన దేశ భక్తుడు’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఇలాంటి ట్విట్స్ ఎందుకని కొందరు నాగబాబుపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్విట్ కు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

“కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే… 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే… ఈశ్వర్, అల్లా… తేరానామ్… సబ్ కో సన్మతి దే భగవాన్… ”నాకు కూడా”…”అని” గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే… ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా” అని ట్వీట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. నాగబాబు ప్రస్తావన తీసుకురాకున్నా.. ఆమె చెప్పాలనుకున్న విషయంను చెబుతూ.. మెగా బ్రదర్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు విజయశాంతి.

Loading...