Friday, April 26, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు బాబు షాక్ ఇస్తుంటె… బాబుకే షాక్ ఇస్తున్న తెలుగు త‌మ్ముళ్లు..

- Advertisement -

పార్టీ ఫిరాయింపుల‌ను బాబు ప్రోత్స‌హిస్తుంటె….సొంత పార్టీలో మాత్రం తెలుగు త‌మ్ముళ్లు బాబు షాక్ ఇవ్వ‌బోతున్నారు. ఆ పార్టీని వీడేందుకు మ‌రో నేత సిద్ధ‌మ‌య్యార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనె జ‌న‌సేన పార్టీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్ష్ చేశారంట స‌ద‌రు నేత‌.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీలోని చాలా మంది అసంతృప్త‌ నాయ‌కులు అటువైపు చూస్తున్నారు. దీనిలో భాగంగానె విజ‌య‌వాడ ఎమ్మెల్యే బోండా ఉమ పార్టీమారేందుకు సిద్ద‌మ‌య్యారు. బెజవాడ రాజకీయాల్లో దీనిమీదె ఆసక్తికర చర్చ సాగుతోంది.

చంద్రబాబు మొప్పు కోసం బోండా ఉమ …. వైఎస్‌ జగన్‌ను ఓ రేంజ్‌లో విమర్శిస్తూ వచ్చిన ఎమ్మెల్యే. చాలా సందర్భాలలో టీడీపీ ఆయన్ను వైసీపీ మీదకు వ్యూహాత్మకంగా ప్రయోగించింది. పార్టీ కోసం తాను చేస్తున్న పోరాటం చూసి ఏనాటికైనా చంద్రబాబు అనుగ్రహిస్తారన్న ఉద్దేశంతో ఆయన చాలా దూకుడుగానే వెళ్లారు. కాని ఇప్పుడు బాబు షాక్ ఇచ్చారు. కొద్దికాలంగా బోండా ఉమా వాయిస్‌ పెద్దగా వినిపించడం లేదు. తనకెందుకు అన్నట్టుగా ఆయన వ్యవహారం సాగుతోంది

కేబినెట్ విస్తరణలో మంత్రిప‌ద‌వి రాక‌పోవ‌డంతో బాబును బ‌హిరంగంగానె ఉమా విమ‌ర్శించారు. కేబినెట్‌ బెర్త్ ఖాయమనుకున్న బోండాకు చంద్రబాబు హ్యాండిచ్చారు. దాంతో ఆగ్రహించిన బోండా ఉమా… చంద్రబాబు నమ్మించి కాపుల గొంతు కోశారని భారీ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని … బోండా ఉమా కబ్జాలు, అవినీతి ఫైల్ చూపించి బెదిరించి పంపించేశారు. అంతటితో ఆగకుండా ఇటీవల టీడీపీ ప్రకటించిన పార్టీ కమిటీల్లో బోండా ఉమాకు చోటు దక్కలేదు.

బోండా ఉమకు వరుస షాక్‌లు వరుసగా తనకు తగులుతున్న షాక్‌లపై పార్టీ అధిష్టానంపై బోండా ఉమ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారట. జనసేనాని పూర్తిస్థాయిగా జనాల్లోకి వచ్చాక, ఆయన ఏం చేస్తారనే విషయం తేలాక బోండా నిర్ణయం తీసుకున్నారు.

బోండా ఉమాను చంద్రబాబు పూర్తిగా ప‌క్క‌న పెట్టార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. దీన్ని టీడీపీ నాయ‌కుల మాత్రం స‌మ‌ర్థించుకుంటున్నారు. ఏదాన్నైనా త‌మ‌కు అన‌కూలంగా మ‌లుచుకోవ‌డం అల‌వాటె క‌దా. అందుకే పార్టీ మారడంలేదు బ్రాంత్ మాత్ర‌మే మారుతున్నార‌ని క‌ల‌రింగ్ ఇచ్చుకుంటున్నారు నేత‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -