ఎందుకయ్యా చిట్టినాయుడూ.. గొడవలోకి మీ ఆవిడను లాగుతావ్ : విజయ సాయి

706
vijaysaireddy comments on nara lokesh
vijaysaireddy comments on nara lokesh

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరో ఒకరి పై విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అధికార పక్షంలో ఉన్న వైసీపీ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అని వైసీపీ తిరిగి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అటూ బిజేపీ, జనసేన కూడా వైసీపీని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చేసిన కానీ జగన్ సర్కాన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.

కొత్త పథకాలతో ప్రజల కోసం జగన్ ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అయితే తాజాగా టీడీపీ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు చేశారు. లోకేశ్, సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ గారి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నావు. అవునా, దానికి జగన్ పర్మిషన్ తీసుకుంటున్నావా? ఎందుకయ్యా లోకేశ్, రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్! అని విజయసాయి వ్యాఖ్యానించారు. అంతకంటే ముందు చేసిన మరో ట్వీట్ లో.. మాలోకం కళ్ళన్నీ ఇసుక మీదే ఉంటాయని విమర్శించారు.

నాడు ఇసుక మాఫియా నుంచి ప్రతి నెల మామూళ్లు అందుకునేవాడని.. ఇప్పుడు ఆదాయం పోయిందని ఏడుపు అంటు విమర్శించాడు. హైదరాబాద్ లో కూర్చుని కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వడం కాదని, ఇక్కడికొచ్చి సమస్యను అధ్యయనం చేసి మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో ఒక ఘటనను చూపి, ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టినాయుడూ! అంటూ లోకేష్ పై కామెంట్స్ చేశారు.

బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నన్ను అరెస్ట్ చేయొచ్చు : జేసీ

బాబూ క‌ప‌ట రాజ‌కీయాల‌కు కాలం చెల్లింది.

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

Loading...