Friday, March 29, 2024
- Advertisement -

వైసీపీనేత మాధ‌వ్‌కు షాక్‌ ?… సీఐ మాధ‌వ్‌ను వెంటాడుతున్న శ‌ని

- Advertisement -

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి టికెట్ సంపాదించాలంటె చాలా క‌ష్టం. అర్ధ‌బ‌లం, అంగ‌బ‌లం ఉండాల్సిందే. అయినా కూడా టికెట్లు ద‌క్క‌ని ప‌రిస్థితి. ఒక వేల టికెట్ ద‌క్కినా నామినేష‌న్ వేసేంత‌వ‌ర‌కు న‌మ్మ‌కం ఉండ‌ని ప‌రిస్థితి. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్ధికి ఎదుర‌య్యింది. అనూహ్యంగా వైసీపీనుంచి హిందూపురం ఎంపీ అభ్య‌ర్ధిగా సీఐ మాధ‌వ్ టికెట్ ద‌క్కించుకున్నారు. ప్ర‌భోధానంద ఆశ్ర‌మ విష‌యంలో టీడీపీ ఎంపీ జేసీ, సీఐ మాధ‌వ్‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అనంత‌రం మాధ‌వ్ త‌న ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి వైసీపీలో చేరారు. అనూహ్యంగా హందూపురం ఎంపీ టికెట్ ద‌క్కించుకున్నారు.

అయితే ఆయ‌న‌ను దరిద్రం వెంటాడుతోంది. గోరంట్ల మాధ‌వ్‌కు టికెట్ విష‌యంలో చిక్కులు త‌ప్పేలే లేవు. త‌న ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా రోజులు అయినా ఆయ‌న రాజీనామాను ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ‌లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఎన్నికల్లో నామినేషన్ వేస్తే, దాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తారన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు మాధ‌వ్‌కు స‌మ‌స్య‌గా మారింది.గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలో సీఐగా ఇంకా పనిచేస్తున్నట్టుగానే రికార్డుల్లో ఉంది. తాను రాజీనామా చేసినా, దాన్ని ఆమోదించకుండా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఈ ఉదయం మాధవ్ ఆరోపించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌న రాజీనామాను ఆమోదించ‌క‌పోవ‌డంతో మాధ‌వ్ ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఒక వేల కోర్టు ఇచ్చే తీర్పుపైనె ఆయ‌న పోటీ చేస్తారా లేదా అన్న‌ది ఆధార‌ప‌డింది. ఒక వేళ కోర్టులో తేల‌క‌పోతె కనీసం ఆయన భార్యని అయినా రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -