పార్క్ హయత్ లో జరిగిన రహస్య భేటీపై జగన్ నిర్ణయం ఇదే ?

587
What is Jagan Thinking About Nimmagadda Meeting TDP Leaders
What is Jagan Thinking About Nimmagadda Meeting TDP Leaders

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీ నేతలు మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి కలిపించుకుని విమర్శలు చేశారు. తమకు నమ్మకం లేదని క్లారిటీ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు సన్నిహితుడని.. చంద్రబాబు సన్నిహితులకు మరింత సన్నిహితుడని.. విమర్శలు వచ్చాయి. అయితే గతంలో వాటిని రాజకీయ విమర్శల్లో భాగంగానే చూశారు కొందరు. మరి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పై కూడా ఇలాంటి విశేషాలు ఏంటి అని ఖండించిన వారు లేకపోలేదు.

దీంతో కోర్టులను ఆశ్రయించడం అనంతరం దెబ్బలు తినడం ఏపీ సర్కార్ వంతు అయింది. కానీ నిజం నిలకడ మీద తెలిసింది. ఆకస్మాతుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావుతో హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో భేటీ అవ్వడం ఆ భేటీకి సంబంధించి ఫూటేజ్ బయటికి రావడం ఈ వ్యవహారంపై అటు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో నాడు జగన్ సర్కారు చేసిన ఆరోపణల్లో ఎంతో కొంత వాస్తవం ఉందని నాటి వారి ఆవేదనను నిజమైందని నిమ్మగడ్డ వ్యవహారం కాస్త అనుమానం గానే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి అంటే ఈ వ్యవహారం బయటకు వచ్చి ఉండకపోతే ఈ ఒక్క విషయంలో జగన్ మాటలు ఎవరు పూర్తిగా నమ్మి ఉండేవారు కాకపోవచ్చు. ఈ విషయంలో నిమ్మగడ్డ మౌన పోరాటం రేంజ్లో నడవడిక దానికి టీడీపీ నేతల తోడు బీజేపీలో ఉండే చంద్రబాబు ఫ్యాన్స్ తోడ్పాటు టీడీపీ అనుకూల పత్రికల మద్దతు అన్ని కలిపి ఈ ఒక్క పేరు చెప్పి ఏపీ ప్రభుత్వానికి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తారని కథనాలు వచ్చాయి. హైకోర్టు మొట్టికాయలు వేయడం అనంతరం సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్ళడం తెలిసిందే. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. ఈ విషయంలో మాట్లాడిన అంబటి రాంబాబు నిమ్మగడ్డను అరెస్టు చేయాలని స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ఒక రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారడంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే జగన్ ఎలా ఆలోచిస్తున్నారు ? నిమ్మగడ్డ విషయంలో తన వాదన ఆవేదన నిజమైన తెలిసిన తరుణంలో జగన్ నెక్స్ట్ స్టేప్ ఏంటి ? ఈ విషయంలో జగన్ తన వైపు నుంచి ఎలాంటి నెక్స్ట్ స్టేప్ తీసుకోవాలి అని అంటున్నారు విశ్లేషకులు. మిగిలిన అందరి కంటే అన్నింటికంటే జగన్ కు కావాల్సింది జనాలు వారి అభిప్రాయాలు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తన ఆవేదనలో నిజం ఉందని తన వేదనలో వాస్తవం ఉందని ప్రజలు ఇప్పటికే గ్రహించేశారు. కాబట్టి జగన్ కు ఇక నిమ్మగడ్డ వ్యవహారంతో పని అయిపోయినట్లే. ప్రజలకు క్లారిటీ ఇచ్చేసినట్లు. కాకపోటే కాకపోతే చట్టం తన పని తాను చేసుపోతుంది అంతే.

లోకేష్ పని అయిపోయిందా ? ఇక అరెస్టేనా ?

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

లాక్ డౌన్ పెట్టడం పై.. టెస్టులు పై మంత్రి ఈటెల క్లారిటీ..!

Loading...