Wednesday, April 24, 2024
- Advertisement -

జ‌గ‌న్‌.. బాబు.. మ‌ధ్య‌లో కేసీఆర్‌…. లాభం ఎవ‌రికో…?

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌లు ముగిశాయి. రెండో సారి సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, మ‌హాకూట‌మి పోటాపోటీగా త‌ల‌ప‌డ్డాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని అధికారం చేప‌డ‌తామ‌ని కూట‌మి ఎట్టుకున్న ఆశ‌లు త‌ల‌క్రిందుల‌య్యాయి. బంప‌ర్ మెజారిటీతో మ‌రో సారి గులాబీ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.

గెలుపు వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉంటాయ‌న‌డంలో సందేహంలేదు. ఊరికే ఓటరు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటు వేయడు. ఈ ప్రభుత్వం ఉండాలని బలంగా కోరుకున్నా, పోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా ఓటర్లతో పొలింగ్ స్టేషన్లు పోటెత్తుతాయి. గ‌తంలో కంటే తెలంగాణాలో పోలాంగ్ శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం అధికార ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు కాని సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఎక్క‌డైనా పెరిగ‌న పోలింగ్ ప్ర‌తిప‌క్షాల‌కు అనుకూలంగా ఉంటుంది..కాని తెలంగాణాలో మాత్రం టీఆర్ఎస్‌కు అనుకూలం అయ్యింది.

కూట‌మి త‌రుపున అన్నీ తానై చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. సీట్ల పంప‌కాల‌నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం, నిధులు స‌మ‌కూర్చార‌న్న వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెట్టినాగాని తెలంగాణా ప్ర‌జ‌లు గులాబీనే ఆద‌రించి కూట‌మి గూబ కుయ్యిమ‌నిపించారు. బాబు ఎన్నిక‌ల్లో అతిగా జోక్యం చేసుకోవ‌డంతో కేసీఆర్‌కు తిక్క‌రేగింది. ఇక లాభం లేద‌నుకొని మ‌రోసారి తెలంగాణా సెంటీమెంట్‌ను ఆయుధంగా చేసుకొని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెల‌రేగిపోయారు.

మ‌రో సారి ఆంధ్రాపాల‌న కావాలా సొంత పాల‌నా కావాలా అంటూ సెంటీమెంట్‌ను ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే పాల‌న అంతా బాబు చేతుల్లోకి వెల్తుంద‌ని అప్పుడు పాల‌న అంతా అమ‌రావ‌తినుంచి జ‌రుగుతుంద‌ని అదిమ‌న‌కు కావాలంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ గొట్టారు. దానికి తోడు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి వెల్లాయి. ఇవ‌న్నీ క‌ల‌సి మ‌రో సారి కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చాయి.

తెలంగాణా సెంటిమెంట్ అస్త్రం తీసి కేసీయార్ తెలంగాణా ఎన్నికల్లో గెలిచాడని మొత్తానికి విశ్లేషణలు వచ్చాయి. అది నిజమే అనిపించేలా భారీ పోలింగ్, ఆనక టీయారెస్ కి భారీ ఎత్తున సీట్లు రావడం కూడా అంతా చూశారు. మరి అటువంటి సెంటిమెంట్ ఏపీలోనూ రగల్చగలరా, అది జరిగితే ఓట్లు కొళ్ల‌గొట్టొచ్చా…?

గత రెండు రోజులుగా తెలుగు తమ్ముళ్ళ మాటలను బట్టి చూస్తూంటే విభజన నాటి గాయాలని లేపి సెంటిమెంట్ పూత పూయాలన్న ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది. 150 సీట్లు టీడీపీకీ వ‌స్తాయ‌ని తెలుగుత‌మ్ముళ్లు ప్ర‌క‌టించారు. ఏపీ ఎన్నికల్లో తానూ వేలు పెడతానని, బాబుకు బదులు బహుమానం ఇస్తామని ఇప్పటికే కేసీయార్ ప్రకటించారు. దానిపైన ఇపుడు ఏపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బాబుపై యుధ్ధం అంటూ కేసీయార్ ఆంధ్రాకు వస్తే అది వైసీపీకీ మేలు జ‌రుగుతుందా టీడీపీకీ మేలు జ‌రుగుతుందా అనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఇదే విధంగా పలువురు తెలుగు తమ్ముళ్ళు, మంత్రుల మాటగా కూడా ఉంది. ఆయన జగన్ కి మద్దతుగా వస్తే తాము విభజన నాటి పాత గాయాలను బయటకు తీస్తామని అపుడే తమ వ్యూహాలను చెప్పకనే చెబుతున్నారు. కేసీయార్ ఆధ్రులను ఎన్ని రకాలుగా తిట్టారో అవన్నీ జనం ముందు ఉంచి సెంటిమెంట్ రగిలిస్తామని కూడా చెబుతున్నారు.

నిజానికి ఉధ్రుతంగా తెలంగాణా ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే ఏపీలో పెద్దగా సెంటిమెంట్ లేదన్నది చాల మంది మాట. అప్పట్లో లగడపాటి రాజగోపాల్ లాంటి వారు సమైక్య ఉద్యమాలు చేసినా స్పందన లేని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్‌పై అప్పుడులేని వ్య‌తిరేక‌త ఏపీ ప్ర‌జ‌ల్లో ఇప్పుడు ఎందుకుంటుందనేది రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా.

ఇక ఏపీలోనూ కేసీయార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. ఏపీ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు. ఆయన తన సొంత రాష్ట్రం కోసం పోరాడాడు తప్ప ఆంధ్రులంతే ద్వేషం లేదన్న సంగతి అంద్రవారు గ్రహించారు కాబట్టే, ఈసారి సెటిలర్లు కూడా పెద్ద ఎత్తున టీయారెస్ కి ఓటు వేశారు.

అటువంటిది ఆంధ్ర సెంటిమెంట్ అంటూ కొత్త అస్త్రం టీడీపీ తమ్ముళ్ళు తీసినా ఉపయోగం అసలు ఉండదని కూడా అంటున్నరు. పైగా అడ్డగోలు విభజనకు అసలు కారణమైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీయార్ ని నిందిస్తే మొత్తం సీన్ రివర్స్ అవుతుందని కూడా చెబుతున్నారు. ఒక వేల కేసీఆర్ ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా జోక్యం చేసుకున్నా అది వైసీపీకే లాభం చేకూరుతుంద‌ని రాప‌కీయ పండితులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -