Thursday, April 25, 2024
- Advertisement -

ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ నోరు మెదపదేం

- Advertisement -

సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అమరావతి లో చేసిన అవినీతి ని, భూదందాలను జగన్ ఇటీవలే ఓ లేఖ లో రాసి ప్రధాన న్యాయమూర్తి కి పంపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ లేఖ పంపిస్తే టీడీపీ కి ఏమైందో ఏమో కానీ జగన్ మొత్తం న్యాయవ్యవస్థ పై ఆరోపణలు చేసినట్లు గా ఫీల్ అయిపోతున్నారు.. ఎపి హైకోర్టు పనితీరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యవహారశైలి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కుమ్మక్కు రాజకీయాలు, మేనేజ్ మెంట్ నైపుణ్యతల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఈ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..

అయితే న్యాయవ్యవస్థ ఏమో కానీ టీడీపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది వారికి దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేసేస్తోంది.. లేఖ రాసిన తొలి తోజు మౌనంగా ఉన్న వారు ఆ తర్వాత లోపాయకారిగా ఎదో ఒప్పందం చేసుకుని రెండు రోజు నుంచి విమర్శలు చేస్తున్నారు.. ఇక ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో తన వైఖరి ఏమిటో ఎపి ప్రజానికానికి తెలియరావడం లేదు.

ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతున్న కదిలి రాకపోవడంతో వారి వైఖరి ఏంటో అర్థం కావట్లేదు.. గతంలో అంతర్వేది విషయంలో బీజేపీ చేసిన హంగామా మామూలుది కాదు మరి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రజల ప్రశ్న.. డిల్లీలో ఉండే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా దీని పై స్పందించకపోవడం గమనార్హం. బిజెపిలోని సోము, జివిఎల్ టిడిపి వ్యతిరేకులుగా ముద్రపడ్డారు. ఈ విషయంలో పార్టీలోని టిడిపి అనుకూల ప్రత్యర్థి సామాజిక వర్గీయులు కూడా స్పందించకపోవడం, తెలుగుదేశం మీడియాకు కనీసం లీకేజీలు కూడా ఇవ్వకపోవడం విచిత్రంగా తోస్తోంది.

బీజీపీ కొంచెం అయినా బ్రెయిన్ ఉంటే ఆ పని చేయదు..?

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

వైసీపీ కి దూరమయ్యే ఆలోచనలో దళిత నేతలు..

టీడీపీ కి ఈ విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -