Friday, March 29, 2024
- Advertisement -

జగన్, చంద్రబాబు పోటీ పడి మరీ మోడీ కి జై కొడితే ఎలా..?

- Advertisement -

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి జై కొట్టడం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ లకు అలవాటే.. ఎందుకంటే తమ పనులు చేయలన్నా, సకాలంలో కొన్ని బిల్లు లు పాస్ కావాలన్నా అక్కడి ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమే.. అందుకే ఆ పార్టీ కి, ప్రధాని కి సీఎం లు సైతం జై కొడుతూ తమ ఉడుతా భక్తి ని చూపిస్తూ ఉంటారు.. అయితే ఆసక్తి కర విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ కి ప్రతిపక్షం వ్యతిరేకంగా పనిచేస్తుంది.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోడీకి సపోర్ట్ చేసే విషయంలో మాత్రం ఒకే తాటిపై అధికార, విపక్షాలు నడుస్తున్నాయి..

పొరుగు రాష్ట్రాలు తెలంగాణ   లో పరిస్థితీ వేరేలా ఉంది.. అధికార పార్టీ దాదాపు మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.. కేసీఆర్ కి మోడీ అంటే మండిపడుతున్నాడు.. జీఎస్టీ బిల్లుల విషయంలో మోడీ ని నిలదీయాలని సమయం కోసం చూస్తున్నాడు.. తమిళనాడు లో అధికార పార్టీ అన్నాడీఎంకే బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. ఇక ప్రతిపక్ష డీఎంకే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగని అధికార అన్నాడీఎంకే పార్టీ అన్ని విషయాలకూ మద్దతు ప్రకటించదు. రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రెండు పార్టీలూ వ్యవహరిస్తాయి. ప్రజాసమస్యల కోసం తమిళనాడులో అధికార, విపక్షాలు ఏకమైన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మోడీ ని పోటీ పడి మరీ సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు, జగన్ లు.. నిజానికి రాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు అన్నట్లు ఇరు నేతలు ప్రవర్స్తిన్నారు.. రెండు పార్టీలూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రెండు పార్టీలు నేరుగా బీజేపీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. కానీ బీజేపీ అడిగినా, అడగకున్నా వీరు ముందుగానే మద్దతు ప్రకటిస్తుండటం చర్చనీయాంశమైంది. తాజాగా వ్యవసాయ బిల్లుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకించడం లేదు. మరి జగన్ ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.

జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లి ఏం సాధించుకోచ్చారు..?

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

జగన్ బీజేపీ పై ఎప్పుడు వత్తిడి తెస్తారో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -