Thursday, April 25, 2024
- Advertisement -

పరిటాల ను చంద్రబాబు పట్టించుకోలేదేంటి.?

- Advertisement -

పార్టీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు చాలాకాలం వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పాలి.. ఎందుకంటే గత రెండేళ్లుగా ఎప్పుడు కూడా అయన పార్టీ ని చక్కదిద్దుపెట్టుకోవాలనే ఆకాంక్ష ఎక్కడా కనిపించలేదు.. అమరావతి పోరాటం, జగన్ ని విమర్శించడమే ఆయనకు సరిపోయాయి..కనీ ఎక్కడ కూడా దిశా తప్పిన పార్టీ ని గాడిలో పెట్టుకోవాలని ఎక్కడా అనుకోలేదు. అలాంటిది ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ లను నియమించి పార్టీ ని బాగుచేయడానికి మొదటి ప్రయత్నం అయితే ఇప్పుడు మొదలు పెట్టారు..  రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గానూ ఇన్ చార్జ్ లను నియమించి సంచలనం రేకెత్తించారు..

అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చి అయన ఇన్ చార్జ్ ల నియామకంలో విజయం సాధించారని చెప్పొచ్చు.. అయితే ఓ ఇద్దరినీ యా లిస్టు లో లేకుండా చేయడం సర్వత్రా ఆసక్తి తెరలేపినట్లయ్యింది.. పార్టీ కోసం జేసి దివాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం చేసిన కృషి అంతా ఇంతాకాదు.. రాజ‌కీయంగా ఆర్థికంగా కూడా పార్టీకి ప‌రిటాల ఫ్యామిలీ ద‌న్నుగా నిలుస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు అడిగితే.. చంద్రబాబు రాప్తాడు ఒక్కటే శ్రీరాంకు ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత నుంచి చంద్రబాబు ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోలేదు.

ఇక‌, జేసీ కుటుంబం కూడా ఇటీవ‌ల కాలంలో కేసుల్లో చిక్కుకున్నా… త‌మ‌ను చంద్రబాబు ప‌ట్టించుకోలేద‌నే ఆవేద‌న‌ను వ్యక్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో త‌మ‌ను ప‌ట్టించుకుంటార‌ని, ఇప్పటికైనా గుర్తింపు ఉంటుంద‌ని అనుకున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ ల విషయంలో తమని పరిగణలోకి తీసుకుంటారని యోచించిన ఇరు కుటుంబ నేతలకు చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు..  దీంతో ఈ రెండు ఫ్యామిలీ లు రాజకీయాలకు దూరం గా ఉండాలా వద్దా అని చిన్న ఆలోచనలో పడ్డాయి.. ఒకవేళ వీటికి మించిన పదవులు చంద్రబాబు ఇస్తారా లేడా పూర్తిగా పక్కన పెట్టడానికి ఇది ఆరంభం లాంటిదా..అని వారిలో మదనం మొదలయ్యింది.. చంద్రబాబుకు స‌న్నిహితంగా ఉండే జిల్లా నాయ‌కులు దీనిపై క్లారిటీ ని కోరుతుండగా వీరు తమ రాజకీయ ఉనికికి వీరేం చేస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -