Friday, March 29, 2024
- Advertisement -

సీఎం జగన్ చికెన్ తినడం ఎందుకు మానేశారో తెలుసా ?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చాలా ఫిట్ గా కనిపిస్తూ హెల్తీగా ఉంటారు. అయితే ఆయన ఇంత ఫిట్ గా యంగ్ గా కనిపించడానికి కారణం అతని జీవనశైలి, ఆహారపు అలావాట్లు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆదివారం తప్ప మిగితా రోజుల్లో కేవలం శాకాహారమే జగన్ తీసుకుంటారని.. చికిన్ ఎట్టి పరిస్థితిల్లో తినరని చెబుతున్నారు. జగన్ గత పాతిక ఏళ్ల నుండి చికెన్ అంటే ఇష్టం చూపడం లేదట. 1996 వ సంవత్సరానికి ముందు జగన్ కి చికెన్ అంటే అత్యంత ఇష్టంగా తీనేవారట.

అప్పట్లో షర్మీల, జగన్ చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తినేవారట. కానీ 1996వ సంవత్సరం తర్వాత ఒక బలమైన కారణం వల్ల జగన్ తనకు ఇష్టమైన చికెన్ ని తినడం మానేశారని విజయమ్మ నాలో- నాతో వైయస్సార్ పుస్తకంలో రాశారు. 1996వ సంవత్సరంలో వైఎస్ ఆర్ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జీవితంలో ఓటమిని చూడని ఒకే ఒక్క నాయకుడు రాజశేఖర్ రెడ్డి. అటువంటి రాజశేఖర్ రెడ్డికి కడప పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడలేని టెన్షన్ పట్టుకుంది. 1996 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు.

ఆ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమయంలో వైయస్సార్ కుటుంబంలో ఎంతో టెన్షన్ మొదలైంది. కుటుంబ సభ్యులు వైఎస్సార్ గెలుస్తారని ఆశలన్నీ వదిలేసుకున్నారు. తన నాన్న ఎన్నికల్లో గెలవాలని షర్మిల ఆరోజు మొత్తం ఉపవాస దీక్షకు పూనుకున్నారు. జగన్ మాత్రం దేవుడు వద్దకు వెళ్లి తన తండ్రి గెలిస్తే చికెన్ వదిలేస్తానని ప్రార్ధించారు. అయితే జగన్, షర్మిల కోరికలు నిజమయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1996 లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చికెన్ ని ముట్టుకోలేదు.

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

మిథున్ రెడ్డి అభినందిస్తే.. జగన్ కోపడ్డారు : రఘురామకృష్ణరాజు

వాక్సిన్ వచ్చేవరకు ఇలానే ఉంటుంది : జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -