పనవ్వాలంటే జగన్‌ని నమ్ముకోవాల్సిన దుస్థితిలో పవన్

2889
Why Pawan Kalyan criticizing on Jagan...?
Why Pawan Kalyan criticizing on Jagan...?

నాలుగున్నరేళ్ళుగా అధికారంలో ఉన్న బాబు బాకా ఊదుతూ ప్రజలను గాలికొదిలేసిన పవన్ కళ్యాణ్ …..అదే నాలుగున్నరేళ్ళలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉన్న నాయకుడిగా పేరుగాంచిన జగన్‌ని నానా మాటలూ అంటూ ఉన్నాడు. సూర్యుడిపైకి ఉమ్మేస్తే తరహాలో పవన్ వ్యవహారం ఉందని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారంటే పవన్ ఏ స్థాయికి దిగజారాడో అర్థం చేసుకోవచ్చు. ఇక 2014 ఎన్నికల్లో బాబు, మోడీలను గెలిపించండి…….గెలిచాక వాళ్ళు తప్పులు చేస్తే…….ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను మీ తరపున ఉండి వాళ్ళను నిలదీస్తా……ప్రశ్నిస్తా అంటూ ప్రగల్భాలు పలికాడు. బాబు, మోడీలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈయనగారు కూడా ఫాం హౌస్‌కి, సినిమాలకు, ప్రమాణ స్వీకారోత్సవాలు అంటూ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత కూడా బాబుకు అవసరమైనప్పుడు బయటికి వచ్చాడు.

ఇక ఇప్పుడు ఎన్నికలు ఆరునెలల్లో ఉన్నాయనగా ప్రజల కోసం ప్రాణాలిస్తా అంటూ సినిమా యాక్టింగ్‌ని మించి పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అధికారంలోకి రాలేదని చెప్పి, పార్టీని నడపలేక సోనియా కాళ్ళ దగ్గర ఓటేసిన ఓటర్ల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టిన కొణిదెల కుటుంబ వారసుడు ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు అని జగన్‌ని ఎద్దేవా చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల సమస్యల పట్ల స్పందించిన ఏ నాయకుడైనా అధికార పార్టీని నిలదీస్తాడు. కానీ షో చేయడం తప్ప రాజకీయం తెలియని పవన్, ప్రజల కష్టాలను ప్యాకేజ్‌ కింద క్యాష్ చేసుకోవడం అలవాటైన పవన్ ఇప్పుడు జగన్ చిత్తశుద్ది గురించి, ప్రజల సమస్యల గురించి జగన్ ఫైట్ చేయడంలేదని విమర్శించే ధైర్యం చేస్తున్నాడు.

పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ కూడా ప్రజల మధ్య ఉన్న నాయకుడు జగన్. ఈ విషయంలో దేశంలో వేరే ఏ నాయకుడు కూడా జగన్‌తో సరితూగడు. అయినప్పటికీ పవన్ మాత్రం సిల్లీగా జగన్‌ని ఎందుకు విమర్శిస్తున్నట్టు……….ఇదే ప్రశ్న జనసేన వ్యవహారాలు చూస్తున్న ఒక పీఆర్వోని ప్రశ్నిస్తే అసలు విషయం ఆయన చెప్పారు. చంద్రబాబును విమర్శిస్తే మీడియాలో అస్సలు కవరేజ్ రావడం లేదు…….కనిపించడం లేదు. అందుకే నేను కూడా ప్రజల మధ్యన ఉన్నాను, పర్యటనలు చేస్తున్నాను అని ప్రజలకు తెలియడం కోసం జగన్‌ని టార్గెట్ చేయకతప్పని పరిస్థితి పవన్‌ది అని కుండబద్ధలు కొట్టేశాడు. అదీ పవన్ దుస్థితి. ఇలాంటి పవన్ రాజకీయ వ్యూహాలు, కుట్రలు పన్నడంలో ఆరితేరిపోయిన బాబును ఎదుర్కోగలడా? అధికారంలో లేకపోయినప్పటికీ అంగబలం, అర్థబలం, మీడియా బలం…….ఇలా చాలా విషయాల్లో బాబుకు ఉన్న స్ట్రెంగ్త్ తనకు లేకపోయినప్పటికీ నిర్విరామంగా పోరాడుతూ…….తనని చూసి తన తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితిని బాబుకు కల్పిస్తున్న జగన్‌తో పవన్‌ని కనీసం పోల్చగలమా? ప్రత్యేక హోదా అంశం ఈరోజుకీ సజీవంగా ఉందంటే దానికి కారణం ఎవరు? బిజెపి నుంచి తప్పక బయటికిరావాల్సిన పరిస్థితిని జగన్ క్రియేట్ చేశాడని ఈ రోజుకీ చంద్రబాబు వాపోవడం లేదా? ఇక అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలపై జగన్‌తో పాటు జగన్ మీడియా కూడా నిలదీసిప్పునడల్లా చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మాత్రం కంగారుపడడంలేదా? మేనేజ్ చేయడానికి నానా తిప్పలూ పడడాన్ని పవన్ చూడడం లేదా? వైఎస్ జగన్, జగన్ మీడియా లేకపోతే తప్పులు చేయడానికి, అవినీతి, అక్రమాలు చేయడానికి బాబు భయపడేలా చేసే వేరే ఏ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడా? రాజకీయం అంటే, చంద్రబాబును ఎదుర్కోవడం అంటే ఫాం హౌస్ వ్యవహారాలు నడిపినంత ఈజీ కాదు పవన్. చేతనైతే బాబును ఎదిరించు……అంతేకానీ పార్టీ పెట్టినప్పటి నుంచీ ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కోసమే పనిచేస్తున్న జగన్‌ని విమర్శించే ధైర్యం చేయకు……..జగన్ ముందు కుప్పిగంతులేసి మీ అన్న చిరంజీవిలాగే పొలిటికల్ కమెడియన్‌గా మిగిలిపోయే ప్రమాదాన్ని కొనితెచ్చుకోకు. ఈ విశ్లేషణలు, కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలోనూ, అలాగే సీనియర్ జర్నలిస్టుల మాటల్లోనూ తరుచుగా ఎందుకు వినిపిస్తున్నాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో పవన్.