Friday, April 19, 2024
- Advertisement -

చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?

- Advertisement -

టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.. సరే నేతలు అంటే ఎదో అనుకుందాం పార్టీ అధినేతలు సైతం ఇంటిపట్టునే ఉంటూ చోద్యం చూస్తుండడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. కరోనా అని ఎప్పుడైతే తొలి సారి పేరు వినపడిందో అప్పటినుంచే చంద్రబాబు, లోకేష్ లో ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటున్నారు..

ఎదో ఫార్మాలిటీ కి ఆన్ లైన్ రాజకీయాలు చేస్తున్నారు కానీ అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.. పార్టీ ఓడిపోయినందుకు వారు అలా చేస్తున్నారా లేదా నిజంగానే కరోనా భయం వల్ల రావట్లేదా అన్నది తెలీట్లేదు.. ఇక చూసి చూసి తెలుగు తమ్ముళ్లకు కూడా విసుగు వచ్చినట్లుంది.. అందుకే భవిష్యత్ లేని పార్టీ లో ఉండడంకంటే వెళ్ళిపోవడం మేలు అని ఇతర పార్టీ లకు తరలిపోతున్నారు.. ఇక వీరు వెళ్ళిపోవడానికి వేరే కారణం కూడా ఉందట..

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌ని చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నార‌ట‌. లేని స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాటాలు చేయాల‌ని ఆదేశించేవార‌ట‌. అధినేత చెప్పిన‌ట్లు చేయ‌లేక‌.. పార్టీలో ఉండ‌లేక చాలా మంది స‌త‌మ‌తం అవుతున్నారు. వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపిన అనంత‌రం ఎమ్మెల్యేల మాట‌ల్లో అది స్ప‌ష్టం అవుతుంది. దీంతో చంద్రబాబు తీరు నచ్చకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారన్న ప్ర‌చారం జోరందుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుత‌మైన పాల‌న అందించ‌డం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి త‌గ్గ‌డం లేదు. వీటన్నింటి కార‌ణంగా ప్ర‌జ‌ల్లో వైసీపీ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఆ పార్టీలో ఉంటేనే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ అని కూడా టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

చంద్రబాబు కు తమ్ముళ్ళను కలిసే టైం కూడా లేదా..

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

న్యాయస్థానం విషయంలో చంద్రబాబు కి అంత అవసరమా..

అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -