Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

- Advertisement -

జగన్ గెలుపు రాష్ట్రంలో ఒక విప్లమని చెప్పాలి.. అయన గెలుపు తో రాజకీయాల్లో ఓ సంచలనం మొదలవగా చంద్రబాబు వంటి నేతలు ఇప్పటికే జగన్ పై గెలవడానికి ప్రయత్నిస్తున్న జగన్ మాత్రం అలాంటి నాయకులకు అందకుండా రోజు రోజు కు ప్రజల దృష్టిలో దేవుడిలా ఎదుగుతున్నాడు.. ఇక అధికారంలోకి రాగానే అధికారం అంటే ఇది అని చెప్పే విధంగా అయన పరిపాలన కొనసాగిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 17 నెలలు పూర్తయ్యింది. అంటే ఏడాదిలో రెండున్నరేళ్లు పూర్తవుతాయన్నమాట..ఈ క్రమంలో జగన్ మొదట్లో చెప్పిన ఓ మాట ఇప్పట్నించీ ఆసక్తి కరంగా కనిపిస్తుంది.

త‌న మంత్రివ‌ర్గాన్ని రెండున్నరేళ్ల త‌ర్వాత రీష‌ఫెల్ చేస్తానని అయన చెప్పిన సంగతి తెలిసిందే.. సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి మొత్తం పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఆయ‌న‌ను ప‌క్కన పెడితే.. మొత్తం 24 మంది ఉన్నారు. వీరిని రీప్లేస్ చేయాలి. అయితే ఇలాంటి పరిస్థితులలో వారిని రీప్లేస్ చేయడం కుదిరేపనేనా అనిపిస్తుంది. అయితే మంత్రులుగా చాలామంది ఆశావహులు ఉన్నారు.. అందులో జగన్ సన్నిహితులు సైతం ఉన్నారు.. వారందరిని జగన్ సంతృప్తి పరుస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది..

తొలి ప‌ది మంది బెస్ట్ మంత్రుల జాబితా ఇప్పుడు వైసీపీ నేత‌ల సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వీరిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి గౌతంరెడ్డి, ప‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి కొడాలి నాని, స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవ‌సాయ మంత్రి కుర‌సాల‌ క‌న్నబాబు, ప‌ర్యాట‌క మంత్రి అవంతి శ్రీనివాస్‌, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వంటివారు తొలి ప‌ది మంది ఉత్తమ మంత్రుల్లో ఉన్నారు. వీరిని ఏమాత్రం కూడా మార్చడానికి జగన్ సముఖంగా లేరట.. మిగిలిన 14 మందిని మర్చి కొత్త కేబినెట్ పనిలో జగన్ ఇప్పటినుంచే కసరత్తులు ఆరంభించారట… మరి రెండో సారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకునే వారు ఎవరో చూడాలి..

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండను గాక ఉండదు..?

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -