టీడీపీ కి ఈ విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు..

- Advertisement -

2019 ఎన్నికల వరకు టీడీపీ ఏం చెప్తే అది రాష్ట్రం ఫాలో అవుతుంది అనుకున్నారు టీడీపీ నేతలు.. ప్రభుత్వం తమదే అని ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడ్డారు.. చంద్రబాబు కొంత హెచ్చరిస్తున్నా కూడా ముసలోడే కదా అని లైట్ తీసుకున్నారు. ఎన్నికలు అయ్యాక కాని తెలీలేదు తాము ఏం కోల్పోయామో. చంద్రబాబు వయసుకు గౌరవమిచ్చి అయన మాట వింటే ప్రజల్లో తమ పార్టీ నమ్మకం పోకుండా ఉండేదని భావిస్తున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్లు ఇప్పుడు టీడీపీ నేతలు బాధపడ్డ వేస్టు.. అయితే వారంతా ఓడిపోయి అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే వారి నేరాల, అవినీతి చరిత్ర ను బయటకి తీస్తూ జగన్ చేస్తున్న అవినీతి పోరాటం చూస్తే వారికి భయమేయడం ఒక ఎత్తు అయిందట.. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు పలు అవినీతి కేసుల్లో జైలు కూడు తింటున్నారు.. అచ్చెన్నా, జేసి ప్రభాకర్, కోళ్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు వంటి టీడీపీ ముఖ్య నేతలు అందరు జైలు ని పలకరించిన వాళ్ళే.. అయితే ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని మిగితావారు నోరు మెదపకుండా ఉంటున్నారట.

ఇక ఇటీవలే సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అమరావతిలో చేసిన భూ దందా, ఇతర అక్రమాలపై సుప్రిం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పై టీడీపీ బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంది.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన లేఖలో ఎన్‌వీ రమణపై పేర్కొన్న అంశాలను పక్కదారి పట్టించేలా.. ఒక వ్యక్తిపై చేసిన అభియోగాలను మొత్తం వ్యవస్థకు ఆపాదించేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

- Advertisement -

ఇటీవలే యనమల రామకృష్ణుడు మీడియా ముందుకు వచ్చారు. సీఎం జగన్‌ రాసిన లేఖపై విమర్శలు, విసుర్లు విసిరారు. న్యాయవ్యవస్థపై పగపట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్న వారు పరిపాలనకు తగరని సెలవిచ్చారు. జగన్‌రెడ్డి బెదిరింపులు తారా స్థాయికి చేరాయని మండిపడ్డారు. న్యాయవ్యవస్థను బెదిరించే స్థాయికి జగన్‌ చేరడం.. బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఈ పెడధోరణలను ఇలాగే వదిలేస్తే రేపు ఎంతకైనా తెగిస్తారంటూ భవిష్యవాణి వినిపించే ప్రయత్నం చేశారు. యనమల చేసిన వ్యాఖ్యలతోనే టీడీపీ నేతల లక్ష్యం ఏమిటో అర్థం అవుతోంది.

న్యాయస్థానం విషయంలో చంద్రబాబు కి అంత అవసరమా..

చంద్రబాబు కి మరో షాక్.. ఇది కూడా ఫలించకపాయే..?

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

ఎల్లో మీడియా జగన్ ని ఇంత బ్యాడ్ చేయాలనీ చూస్తుందా..

Most Popular

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేశారు నటుడు సమీర్. గతంలో...

సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో తరుణ్. చిన్నతనంలో కూడా కొన్ని సినిమాలో తరుణ్ నటించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా...

Related Articles

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌...

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...