Wednesday, April 24, 2024
- Advertisement -

అందుకే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు..టీడీపీ, భాజాపాను ఉతికి ఆరేసిన అంబటి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో వరద…బురద రాజకీయం ఊపందుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కొద్ది రోజులుగా జగన్ పై టీడీపీ చేస్తున్న బురద రాజకీయాన్ని కడిగి పారేశారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారని తెలిపారు.

ఈ మధ్య బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య ‘పచ్చ’ రక్తం ప్రవేశించిన తర్వాత యాక్టివ్ అయ్యారని సెటైర్లు వేశారు.ఈ పచ్చ రక్తంతో మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే దెబ్బతింటారు.. జాగ్రత్త. వాస్తవాలను పరిశీలించి మాట్లాడాల్సిన బాధ్యత ఓ జాతీయ పార్టీకి ఉంది. అంతేతప్ప బురద చల్లుడు కార్యక్రమాలు చేపట్టవద్దు’ అని బీజేపీకి హితవు పలికారు.

పచ్చ పుష్పాలన్నీ కమల వనంలో చేరుతున్నాయని.. అక్కడికి వెళ్లిన పచ్చ పుష్పాలన్నీ జగన్‌పై విమర్శలు చేసే కార్యక్రమం మొదలుపెడుతోందన్నారు. బీజేపీ వాళ్లు జాగ్రత్తపడాలని.. కమల వనంలోకి వెళ్లిన వీరంతా మళ్లీ పచ్చ వనంలోకి వస్తారని.. ఎంత స్పీడుగా వెళ్లారో.. అదే స్పీడుగా ఎన్నికల సమయానికి వచ్చి చంద్రబాబు చెతంకు చేరుతారని జోష్యం చెప్పారు.

వరదలప బాబు చేస్తున్న పచ్చ రాజకీయంపైనా మండి పడ్డారు. చంద్రబాబు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడం లేదని అంబటి దుయ్యబట్టారు. చేయి నొప్పి వస్తే చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లడం ఏంటని అంబటి ప్రశ్నించారు. వరద ముప్పు ఉంది కాబట్టే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనీ, అంతేతప్ప ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయవద్దని బాబుకు హితవు పలికారు.

బాబు ఇంటిని ముంచడానికి కృష్ణా నదికి వరదలు సృష్టించారనడం దుర్మార్గపు ఆలోచనంటూ మండిపడ్డారు. బాబు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని.. ఓ రకంగా సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -