Thursday, March 28, 2024
- Advertisement -

జగన్ పై గోరంట్ల అసంతృప్తికి కారణం అతనేనా..?

- Advertisement -

రాజకీయాల్లో నాయకులు అలకపాన్పులు ఎక్కడం సహజమే.. తాము అనుకున్నది జరగకపోయినా, దానికి సపోర్ట్ చేయకపోయినా తాము తలచింది అధిష్టానం వినకపోయినా నాయకులు ఆలపాన్పు ఎక్కుతూ ఉంటారు.. అయితే ఇటీవలే ఈ అలకపాన్పు ఎక్కడం వైసీపీ లో ఎక్కువవుతుందని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు  అలకపాన్పులు ఎక్కుతూ అధిష్టానాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నారు తాజాగా హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు, మాజీ పోలీస్ గోరంట్ల మాధ‌వ్ అల‌క పాన్పు  ఎక్కారని వార్తలు వినిపిస్తున్నాయి..

అయితే ప్రజల్లో ఎక్కువగా దూకుడుగా ఉండే గోరంట్ల కి అధిష్టానానికి ఎక్కడ చెడిందనే కారణాలు అక్కడి ప్రజలు ఇప్పుడు వెతుకున్నారు.. అందుకు బలమైన కారణం ఎదో ఉంటుందని అనుకుంటున్నారు.. వారు అనుకున్నట్లు గానే వారి మధ్య దూరానికి హిందూపురం ఒక వేదిక అయ్యిందట.. త‌న‌కు అనుకూలంగా ఉన్న ఓ వ్యక్తికి స్థానికంగా హిందూపురంలో ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నార‌ని.. ఈ విష‌యంలో విజ‌య‌సాయిరెడ్డిపై కూడా ఒత్తిడి తెచ్చార‌ని చెబుతున్నారు. ఆయ‌న‌కు ఇక్కడి ప‌గ్గాలు అప్పగిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్యను ఓడించి రికార్డు సృష్టించే బాధ్యత తాను తీసుకుంటాన‌ని కూడా హామీ ఇస్తున్నార‌ట‌.

అయితే, ఈ విష‌యంలో సాయిరెడ్డి ఏమీ చెప్పలేద‌ని, సీఎం జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయ‌త్నిస్తే.. ఆయ‌న స్పందించ‌లేద‌ని ఈ కార‌ణంగానే ఎంపీ గోరంట్ల మాధవ్ మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు.ఇంకా రెండు మూడు కారణాలు కూడా గోరంట్ల లకు కారణమట.. విజయ్ సాయి రెడ్డి కూడా చీటికీ మారికి తనకు క్లాస్ లు పీకడం ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదట.. ఏదేమైనా.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి.. మాధ‌వ్‌లో మార్పు మాత్రం క‌నిపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే గ‌తంతో పోలిస్తే ఆయ‌న‌లో దూకుడు త‌గ్గింద‌నే తెలుస్తోంది.

వైజాగ్ కి మహర్దశ మొదలైందా..

సుప్రీం నిర్ణయం తో రాజకీయ నాయకులలో వణుకు పుడుతుందా..?

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండను గాక ఉండదు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -