గుండెలు బాదుకునోళ్లు.. సిగ్గుతో బిగుసుకు పోయారు

817
YCP MP Vijayasai Reddy Counter Tweet to TDP and Gang
YCP MP Vijayasai Reddy Counter Tweet to TDP and Gang

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ‘కియా పరిశ్రమ తరలిపోతోందని గుండెలు బాదుకునోళ్లు ఇప్పుడు సిగ్గుతో బిగుసుకు పోయారు’ అని విమర్శించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ..

అప్పట్లో కియా సంస్థ ప్రతినిధులు ఖండించినా ఎల్లో మీడియా బోగస్‌ వార్తల దాడి కొనసాగించిందని, సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో కియా కంపెనీ రూ.400 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించేటప్పటికి నోళ్లు పెగలడం లేదని ట్వీట్‌ చేశారు.

అదే విధంగా ‘పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు’ అని మరో ట్వీట్‌ చేశారు.

Loading...