Friday, March 29, 2024
- Advertisement -

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ కి ఒకప్పుడు వీరాభిమానని అందరికి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు ఆయన గురించి స్పందించనట్లు ఎక్కడా కనిపించరు. వైసీపీ ప్రభుత్వం విధానాలపై మాత్రం పార్టీ తరఫున మాట్లాడే బాలయ్య సీఎం జగన్ ని నేరుగా విమర్శించడం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అదే సమయంలో తన నియోజికవర్గం యొక్క అభివృద్ధి పైన అప్పుడప్పుడు చిన్న చూపూ చూపిస్తిందని మాత్రమే మాట్లాడుతూ ఉంటారు.

తాజాగా నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురం సంబంధించి సీఎం జగన్ ముందు కొత్త డిమాండ్ ఉంచిన సంగతి తెలిసిందే. త్వరలో జరిగే జిల్లాలో విభజనతో తన నియోజకవర్గం హిందూపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈమేరకు ఆయన సీఎం జగన్ కి లేఖ రాసిన సంగతి మనం చూసాం. హిందూపురంను జిల్లాగా చేస్తూ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో రాశారు. హిందూపురంను ఆ జిల్లా కి హెడ్క్వార్టర్ గా ఉంచాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే జగన్మోహన్రెడ్డికి బాలయ్య బాబు రాసినటువంటి లేఖ విషయం దుమారం రేకేత్తిస్తోంది. ఇది రాష్ట్రంలో కాదు టిడిపి లో జరుగుతున్న చర్య. ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు యొక్క అనుమతి తీసుకున్నారా లేక ఈ విషయంలో తన సొంత నిర్ణయంతో బాలయ్య బాబు ముందుకెళ్లారా అనేది ప్రశ్న.

హిందూపురం నియోజకవర్గం గురించి జగన్ కు లేఖ రాయడంపై బాలయ్య మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకాలం బావ దగ్గర సైలెంట్ గా ఉండే బామ్మర్ది గా మాత్రమే ఉన్నటువంటి బాలయ్య బాబు సీనియర్ ఎన్టీఆర్ ఆత్మనీ బాధ పడుతూ వచ్చావారని ఇప్పుడు మాత్రం టిడిపిలో ఒక వర్గం బాలయ్య చేసినటువంటి దానికి శభాష్ అంటుందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారు ప్రశాంతంగా నిద్రపో చాలా కాలం అయిందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా టార్గెట్ చేస్తూ అన్యాయలు చేసిన వాళ్ళ మీద స్కాములు చేసిన వాళ్ళ మీద పర్ఫెక్ట్ నిజాయితీ కేసులు పెడితే లోపలేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నో స్కాములు చేసినటువంటి ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నవారు భయం భయంగానే బ్రతుకుతున్నారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు కాకుండా మరింత బలమైన వ్యక్తి తమకు కావాలని టీడీపీ ఒక వర్గం భావిస్తోంది.

బాలయ్య బాబు ఇప్పటికైనా కాస్త ధైర్యం గా ఒక అడుగు ముందుకేసారని చాలామంది భావిస్తున్నారట. టిడిపి అనేది నందమూరి వారి చేతుల్లోకి రావాలని కొంతమంది కోరుతుంటే జగన్మోహన్ రెడ్డి బాలయ్య బాబు ని తనవైపు తిప్పుకునే లాగా ప్లాన్ చేస్తున్నారనేవారు లేకపోలేదు.

నందమూరి బాలకృష్ణ కోరినట్లుగానే హిందూపురంను జిల్లాగా శాంక్షన్ హెడ్క్వార్టర్ గా శాంక్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. తద్వారా బాలయ్య నేరుగా వైసీపీలో జాయిన్ కాకపోయిన ఆయన సపోర్ట్ ప్రజల దృష్టిలో జగన్ మీదనే ఉంటుందనేటువంటి కాన్సెప్ట్ ని.. ఆ రకమైన ఫీలింగ్స్ ని ఇచ్చేలా జగన్ స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. నేరుగా రాకపోయినా బాలయ్య బాబు ఎప్పటికైనా జగన్ కి సపోర్ట్ చేసే వ్యక్తే అనేటువంటి ఫీలర్స్ ని జగన్మోహన్రెడ్డి బ్యాచ్ జనాల్లోకి వదులుతోందని తెలుస్తోంది.

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -