Saturday, April 20, 2024
- Advertisement -

6న జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ఏం చెబుతారు ..?

- Advertisement -

ఈ నెల 25వ తారీఖు(గురువారం) వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వైజాగ్ ఎయిర్‌పోర్టులో హ‌త్య‌య‌త్నం జ‌ర‌గ‌డం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. జ‌గ‌న్‌పై జ‌రిగిన‌ దాడిని అన్ని రాజ‌కీయ పార్టీలు ఖండించాయి.ఒక్క అధికార టీడీపీ పార్టీ త‌ప్ప‌.జ‌గ‌న్‌పై దాడి గురించి అధికార‌,ప్ర‌తిప‌క్షాలు మాట‌ల యుద్ధం కొన‌సాగుతునే ఉన్నాయి. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఇప్పటికీ బాధితుడు వైఎస్ జగన్ కానీ…పోలీసులు కానీ చెప్పడం లేదు. నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ దాడి విషయమై ఇప్పటికీ పోలీసులు ఓ కొలిక్కిరావడం లేదు.

అయితే దాడిపై మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ ను హతమార్చేందుకు టీడీపీ కుట్రలో భాగంగానే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంటే జగన్ కావాలనే తనపై దాడి చేయించుకుని కోడికత్తి డ్రామాలు ఆడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. దాడికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు పెదవి విప్పుతారా అని సర్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడు ఈ టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారా అంటూ యావత్ తెలుగు రాష్ట్రాలు గమనిస్తున్నాయి. పోలీసులకు సైతం వాంగ్మూలం ఇవ్వని జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

వైద్యుల సూచన మేరకు పాదయాత్రకు విరామం ప్రకటించిన జ‌గ‌న్‌,తిరిగి నవంబర్ 3నుంచి మళ్లీ విజయనగరంలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. అయితే నవంబర్ 6న విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు వైసీపీ శ్రేణులు సన్నాహాకాలు చేస్తున్నారు. నవంబర్ 6న జగన్ బహిరంగ సభలో దాడికి సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. దాడి తర్వాత జరిగిన పరిణామాలు, టీడీపీ శ్రేణుల విమర్శలను ప్రజలసాక్షిగా తిప్పికొట్టేందుకు జగన్ వ్యూహ రచన చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -