Thursday, April 25, 2024
- Advertisement -

జ‌గ‌న్ దెబ్బ‌కు సీబీఐకే షాక్ ఇచ్చిన బాబు…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉంది. వాజ్ పేయ్ హ‌యాంలో అటు కేంద్రంలోనూ ఇటు…రాష్ట్రంలోనూ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో నేనే సీనియ‌ర్‌ని , నాకు 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌ని గ‌ర్వంగా చెప్పుకుంటుంటారు. ఇది అయ‌న పరాకాష్ట రాజ‌కీయానికి ప్ర‌తీకని చెప్ప‌వ‌చ్చు.

బాబు 40 సంవ‌త్స‌రాల అనుభ‌వంలో కొమ్ములు తిరిగిన ఏరాజ‌కీయా నాయ‌కుడికి భ‌య‌ప‌డలేద‌ని చాలా సంద‌ర్భాల్లో సెల విస్తుంటారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న జ‌గ‌న్ దెబ్బ‌కు 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబు గ‌డ‌గ‌డా వ‌ణికిపోతున్నారు. రాజ‌కీయాల్లో బాబు అంత అనుభ‌వం లేని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే ..జ‌గ‌న్ దెబ్బ‌కు చంద్ర‌బాబు ఎన్ని యూట‌ర్న‌లు తీసుకున్నారో అద‌రికీ తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని పార్ల‌మెంట్‌లో అన్ని పార్టీలు అంగీక‌రించాయి. భాజాపా కూడా మేము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌త్యేక‌ హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ,భాజాపా క‌ల‌సి పోటీ చేసి అధికారంలోకి వ‌చ్చారు. వీరికి జ‌గ‌న‌సేన కూడా మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక‌హోదాపై కేంద్రం అర్థికసంఘం పేరుతో మెలిక పెట్టింది. ప్ర‌త్యేక హోదాబ‌దులు అందుకు స‌మానంగా ప్ర‌త్యేక ప్యాకేజీని ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక సార్లు ఖండించారు. అసెంబ్లీ స‌మావేశాల్లో కూడా జ‌గ‌న్ కేంద్ర నిర్ణ‌యంతో విభేదించారు. రాష్ట్రం అభి వృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

త‌ర్వాత సీన్ చూస్తే….త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌త్యేక హోదాను తుంగ‌లోకి తొక్కి బాబు దానికి స‌మాన‌మైన ప్ర‌త్యేక ప్యాకేజీకీ ఒప్పుకున్నారు. అంతేనా అసెంబ్లీలో ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కృత‌జ్ణ‌త‌లు తెలుపుతూ తీర్మానం చేసి కేంద్రానకి పంపారు. అప్ప‌టి మంత్రి వెంక‌య్య‌నాయుడుకు రాష్ట్రానికి పిలిపించి స‌న్మానాలుకూడాచేశారు.

త‌ర్వాత ప్ర‌త్యేక హోదాకోసం వైసీపీ పార్టీతో పాటి ఇత‌ర సంఘాలు కూడా అనేక ఉద్య‌మాలు చేశారు.దీంతో టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో..ఎక్క‌డ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు ఎక్క‌డ పేరు వ‌స్తాద‌న‌నే కుల్లుతో ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు న్యూట‌ర్న్ తీసుకున్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదావ‌ద్ద‌ని నేను ఎప్పుడూ అన‌లేద‌ని నిస్సిగ్గుగా ప్ర‌క‌టించుకున్నారు.

జ‌గ‌న్ ఒక‌డుగు ముందుకేసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో బాబులో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. వెంట‌నే అసెంబ్లీ స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానం ఎవ‌రు పెట్టినా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి బాబు తెల్లారే స‌రికి న్యూట‌ర్న్ తీసుకుని…మేమే స‌ప్రేటుగా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

అత‌ర్వాత భాజాపా, టీడీపీలు రెండూ విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. అధికార టీడీపీనేత‌లే ల‌క్ష్యంగా ఐటీ దాడులు చేసింది. దీనికి తోడు జ‌గ‌న్‌పై జ‌రిగిన క‌త్తి దాడి త‌ర్వాత బాబులో మ‌రింత అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌య్యింది. ఈ దాడి ఘ‌ట‌న‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టులో కేసు వేశారు వైసీపీ. కోర్టు కూడా థ‌ర్డ్ పార్టీ చేత విచార‌ణ జ‌రిపించే అవ‌కాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పోల‌వ‌రం, ఇసుక , భూకుంభ‌కోణాల‌పై సీబీఐతో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని భాజాపా నేత‌లు కూడా కేంద్రాన్ని కోరారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బాబులో అభ‌ద్ర‌తా భావం పెరిగిపోయింది. ఎక్క‌డ రాష్ట్రంలో జ‌రిగిన అవినీతి మీద‌, జ‌గ‌న్‌పై క‌త్తి దాడి ఘ‌ట‌న‌మీద సీబీఐ విచార‌ణ జ‌రుగుతాదోన‌ని బాబు జ‌డుసుకున్నారు. దాంతో అస‌లు రాష్ట్రంలో సీబీఐ దాడులు చేయ‌కుండా ఏకంగా జీవోను తీసుకొచ్చారు.ఈ ప‌రిణామాల‌న్ని చూస్తుంటే జ‌గ‌న్ దెబ్బ‌కు ఏకంగా సీబీఐకే బాబు షాక్ ఇచ్చార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రో వైపు బాబు త‌ప్పులు చేయ‌క‌పోతే ఎందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌చేత విచార‌ణ‌కు అంగీక‌రించ‌లేద‌ని రాజ‌కీయ నాయ‌కులు అంటున్నారు. ఏది ఏమైనా బాబు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -