Thursday, April 25, 2024
- Advertisement -

వైసీపీలో రచ్చ.. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్..!

- Advertisement -

నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, లీడర్ల మధ్య వర్గ విభేదాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు ఈ గొడవలను ఆపడానికి ప్రయత్నించిన అవి తగ్గడం లేదు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డికి మధ్య వచ్చిన విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. వీరి మధ్య గొడవలు రెండు నెలల క్రితం మొదలయ్యాయి.

రీసెంట్ గా ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో కోటంరెడ్డిని పోలీసు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అతను బయటకు వచ్చి మాట్లాడుతూ.. సరళను ఇక్కడకు తీసుకొచ్చింది కాకానే అని ఆయన నేరుగా ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన స్వేచ్చను కాకాని దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ క్రమంలో వీరిద్దరి తీరుపై పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారట.

ఎమ్మెల్యేల ఇద్దర్ని రాజధానికి రావాల్సిందిగా ఆదేశించారు. సీఎం క్యాంపు ఆఫీస్ లో ఇరువురు నేతలతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఇలాంటివి మరోసారి జరగకుడదు అని వారిద్దరికి జగన్ సీరియస్ గా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇరువురు ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు కారణం రియలెస్టేట్ అని కూడా కొందరు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -