Friday, April 19, 2024
- Advertisement -

సీనియర్లకు షాక్.. జూనియర్లకు పదవులు.. జగన్ వ్యూహం ఏంటి ?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఇటీవలే ఏడాది అయింది. ఈ ఏడాదిలో జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. మరో పక్క కరోనాను కట్టిడి చేస్తూనే ఇంకోవైపు ప్రత్యర్ధుకు షాక్ లు ఇస్తున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలను బయట పెడుతూ.. బాబు హయాంలో మినిస్టర్లు గా చేసిన వారిని కటకటల వెనక్కి పంపుతున్నారు.

రాజధాని మార్పు, జిల్లాల విభజన అంశాల్లోకి ప్రత్యర్థి పార్టీలను ముగ్గులోకి లాగి అభివృద్ధికి ఈ పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ సీఎం అయ్యాక పార్టీలో ఎన్నో ఏళ్ళుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, పార్టీ కోసం ఏ మాత్రం కష్టపడని వారికి కీలక పదవులు ఇస్తుండటంపై సీనియర్లంతా లోలోపల ఫీల్ అవుతున్నారట.

ఇటీవల వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్సేగా గెలిచిన ఇద్దరికి జగన్ మంత్రి పదవీ ఇవ్వడంతో పార్టీలో విస్కృతంగా చర్చ జరుగుతోంది. జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై.. సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అప్పలరాజు, వేణులు పార్టీ కోసం కష్టపడింది ఏమిలేదని అంటున్నారు. ఇప్పుడన్న క్యాబినెట్లోనూ బోత్స, పెద్దిరెడ్డి మినహా ఎవరూ సీనియర్లు లేరంటున్నారు. గతంలో మంత్రలుగా చేసినవారు వైసీపీలో ఎంతోమంది ఉన్నారు. వీరంతా వైసీపీ అధికారంలోకి వస్తే చక్రం తిప్పవచ్చని పార్టీకోసం కష్టపడ్డారు. అయితే వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.

తొలి క్యాబినెట్లో జూనియర్లకే జగన్ పెద్దపీఠ వేశారని అంటున్నారు. జగన్ తన సొంత ఏజెండాలో భాగంగానే ఇలా చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను కూడా జగన్ జూనియర్లకు కేటాయించడంపై సీనియర్లు అసంతృప్తిలో రగిలిపోతున్నారట. వైసీపీ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుండటంతో ఇది ఎలాంటి మలుపుకు దారి తీసుస్తుందో అనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.

రైతుకు ట్రాక్టర్‌.. చంద్రబాబు రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..!

విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -