పూర్తి పొలిటీషియ‌న్‌గా మారిన జ‌గ‌న్‌…ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే….!

2291
YS Jagan Kadapa Tour : Jagan focus on selection of candidates
YS Jagan Kadapa Tour : Jagan focus on selection of candidates

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతంగా ముగించిన వైఎస్ జ‌గ‌న్ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుని సొంత జిల్లా క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఇక్క‌డే మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు. పులివేందుల త‌ర్వాత ఇడుపుల పాయ‌లోని వైయ‌స్ స‌మాధికి నివాళి అర్పిస్తారు. అనంత‌రం ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, అభ్య‌ర్తుల ఎంపిక‌, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌పై అందుబాటులో ఉన్న పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు.

ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్ట‌డంతోపాటు అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక సొంత జిల్లాలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై నేత‌ల‌ను నివేదిక కోరిన‌ట్లు తెలుస్తోంది. 14 నెల‌ల పాటు పాద‌యాత్ర‌పేరుతో జిల్లా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నసంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జిల్లాలోని ప‌రిస్థితుల అధ్య‌యనం తో పాటుగా తాను చేయించిన స‌ర్వేల వివ‌రాల‌ను జ‌గ‌న్ జిల్లా పార్టీ నేత‌ల‌తో స‌మీక్షించ‌నున్నారు.

సొంత జిల్లాలో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని టీడీపీ కొత్త కొత్త వ్యూహాలు ప‌న్నుతోంది. ఈసారి ఎలాగైనా క‌డ‌ప‌లో త‌న స‌త్తా చాటాల‌ని ఆరాట‌ప‌డుతోంది. 2014 లో వైసీపీ త‌రుపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నేత‌ల ఓట‌మే టార్గెట్‌గా వ్యూహాలు అమ‌లు చేయ‌నున్నారు జ‌గ‌న్. ఈ సారి క‌డ‌ప ఎంపీగా మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేయించేందుకు బాబు సిద్ద‌మ‌వుతున్నారు. ఇక జ‌గ‌న్ కూడ ఈసారి ఎంపీ అభ్య‌ర్తిని మార్చే ప‌నిలో ఉన్నారు జ‌గ‌న్‌.

వైఎస్‌ కుటుంబంలోనే ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని అవినాష్‌కు ఎక్కడైనా ఎమ్మెల్యేగా అవకాశమిస్తారని సమాచారం. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి ఎంపి అవినాశ్ రెడ్డిని బ‌రిలోకి దింపే అవ‌కాశం మెండుగా ఉంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇక పాద‌యాత్ర ముగించిన జ‌గ‌న్ బ‌స్సు యాత్ర ద్వారా అస‌లు ఆట‌ను ప్రారంభించ‌నున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితులు, స‌ర్వేవివ‌రాల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. ఇక పాద‌యాత్ర స‌మ‌యంలో జిల్లాల వారీగా..నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌గ‌న్ ఓ అంచాన‌కు వ‌చ్చారు. ఇక‌, స‌ర్వేల ద్వారానూ త‌న‌కు కావాల్సిన స‌మాచారం సేక‌రించారు. ఇప్పుడు అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న పై జ‌గ‌న్ దృష్టి సారించారు.

మ‌రో వైపు టీడీపీ వేస్తున్న ఎత్తుల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న జ‌గ‌న్ అందుకు త‌గ్గ‌ట్టు వ్యూహాల‌కు రెడీ అవుతున్నారు. ఇక సొంత జిల్లానుంచి అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న మొద‌లు పెట్ట‌నున్నారు.క‌డ‌ప జిల్లా లో జ‌మ్మ‌ల‌మ‌డుగు విష‌యం లో జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని స‌మాచారం.